AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శని గ్రహానికి భయపడి మోసపోయిన బీజేపీ నేత కుటుంబం.. నడిరోడ్డులో దోచేసిన దుండగులు

ఉత్తరప్రదేశ్‌‌లో పట్టపగలు బీజేపీ నేత భార్య, తల్లిని మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మోసగాళ్లు వారిని హిప్నటైజ్ చేసి నగదు, బంగారు గొలుసు, ఉంగరం, మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. అత్యంత రద్దీగా ఉండే కూడలిలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

శని గ్రహానికి భయపడి మోసపోయిన బీజేపీ నేత కుటుంబం.. నడిరోడ్డులో దోచేసిన దుండగులు
Police Inquiry
Balaraju Goud
|

Updated on: Dec 26, 2023 | 9:06 PM

Share

ఉత్తరప్రదేశ్‌‌లో పట్టపగలు బీజేపీ నేత భార్య, తల్లిని మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మోసగాళ్లు వారిని హిప్నటైజ్ చేసి నగదు, బంగారు గొలుసు, ఉంగరం, మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. అత్యంత రద్దీగా ఉండే కూడలిలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

హర్దోయ్ జిల్లాలో బీజేపీ నేత ముకుల్ సింగ్ కొత్వాలి ప్రాంతంలోని మంగ్లీ పూర్వాలో నివసిస్తున్నారు. భార్య భూమిక సింగ్ ఏదో పని నిమిత్తం అత్త పూర్ణిమ సింగ్‌తో కలిసి సినిమా స్క్వేర్‌కి వచ్చింది. ఇద్దరు యువకులు అత్తగారు, కోడలు దగ్గరికి వచ్చారు. పూర్ణిమా సింగ్‌ను హిప్నటైజ్ చేసిన దుండగులు, ఆమె మనవడు శని ప్రభావంలో ఉన్నాడని చెప్పాడు. శని నీడను తొలగిస్తామనే పేరుతో పర్సు, బంగారు గొలుసు, ఉంగరం, మొబైల్‌ ఫోన్‌తో దొంగలు పారిపోయారు. పర్సులో రూ.20 నగదు ఉన్నట్లు బాధిత మహిళలు తెలిపారు.ఈ ఘటనపై బీజేపీ నేత భార్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టపగలు జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు ఏఎస్పీ నృపేంద్రకుమార్ తెలిపారు. ఇద్దరు దొంగలు ఈ నేరానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటన తర్వాత పోలీసుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దొంగలు హిప్నటైజ్ చేసి పట్టపగలు నగరంలోని అత్యంత రద్దీగా ఉండే రహదారిపై నేరానికి పాల్పడ్డారు. నగదు, బంగారు గొలుసు, ఉంగరంతో దుండగులు పరారయ్యారు. గుర్తుతెలియని నేరగాళ్లను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నట్లు ఏఎస్పీ నృపేంద్ర కుమార్ తెలిపారు. ఫుటేజీ అధారంగా దుండగులను గుర్తిస్తామన్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…