AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఈ ఆఫీస్‌లో అడుగు పెట్టాలంటే హెల్మెట్ ధరించాల్సిందే..! చుక్కలు చూపుతోన్న సర్కార్ కొలువు

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం 2016 లో ఏర్పడింది. అప్పటి నుంచి మండల కేంద్రం లో ఎంపీడీవో కార్యాలయం పాత భవనంలోనే కొనసాగుతోంది. భవనం శిథిలావస్థలో ఉండటంతో ఏడాది నుంచి పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. గత ఏడాది ఎంపీడీవో కూర్చుని ఉండగా ఆయన టేబుల్ పై పెచ్చులు ఊడి పడ్డాయి. అదృష్టవశత్తు ఆయనకు ఏమి కాలేదు.ఈ విషయాన్ని ఉన్నతాధికారుల కు చెప్పడం తో అప్పటి అదనపు కలెక్టర్ ఎంపీడీవో కార్యాలయాన్ని తరలించాలని తక్షణమే మార్చాలని ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఆదేశాలు అమలు కాలేదు. ఈ ఏడాదిలో రెండు సార్లు..

Telangana: ఈ ఆఫీస్‌లో అడుగు పెట్టాలంటే హెల్మెట్ ధరించాల్సిందే..! చుక్కలు చూపుతోన్న సర్కార్ కొలువు
MPDO Office
G Sampath Kumar
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 09, 2023 | 12:33 PM

Share

జగిత్యాల, ఆగస్టు 9: ఎంపీడీఓ ఆఫీసులో అడుగు పెట్టాలంటే భయం. ఎటు చుసిన పెచ్చులు కనబడుతుంటాయి. ఇప్పుడు వర్షాకాలం.. గోడలు కూలే ప్రమాదం ఉంది. ఉద్యోగులు ప్రాణాన్ని కాపా డుకోవడానికి .. హెల్మెట్ ధరిస్తున్నారు. సహజంగా బైక్ పై వెళ్ళే సమయం లో హెల్మెట్ ధరిస్తారు. కానీ.. ఈ ఆఫీస్ లో పని చేసి ఉద్యోగులు మాత్రం హెల్మెట్ ధరిస్తున్నారు.. ఈ ప్రభుత్వం ఆఫీస్ ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం 2016 లో ఏర్పడింది. అప్పటి నుంచి మండల కేంద్రం లో ఎంపీడీవో కార్యాలయం పాత భవనంలోనే కొనసాగుతోంది. భవనం శిథిలావస్థలో ఉండటంతో ఏడాది నుంచి పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. గత ఏడాది ఎంపీడీవో కూర్చుని ఉండగా ఆయన టేబుల్ పై పెచ్చులు ఊడి పడ్డాయి. అదృష్టవశత్తు ఆయనకు ఏమి కాలేదు.ఈ విషయాన్ని ఉన్నతాధికారుల కు చెప్పడం తో అప్పటి అదనపు కలెక్టర్ ఎంపీడీవో కార్యాలయాన్ని తరలించాలని తక్షణమే మార్చాలని ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఆదేశాలు అమలు కాలేదు. ఈ ఏడాదిలో రెండు సార్లు పెచ్చులు ఊడి పడ్డాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఆఫీసుకు వచ్చిన సిబ్బంది హెల్మెట్లు ధరించి డ్యూటీ చేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం.. ఇప్పటికే భారీ వర్షాలు కురిసాయి.. గోడలు మొత్తం తడిసిపోయాయి.. ఇప్పుడు నిత్యం పెచ్చులు పడుతున్నాయి..బయపడుకుంటూ పని చేయాల్సిన పరిస్థితి ఉంది.. దీనితో.. ఇకా లాభం లేదని హెల్మెట్ ధరించి.. విధులు నిర్వహిస్తున్నారు.. ఏమైనా జరుగుతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అంటున్నారు. ఇటు ఉద్యోగం ముఖ్యం.. అటు ప్రాణం ముఖ్యం.. హెల్మెట్ దరిస్తే తలకు గాయాలు కావని.. ఇలా విధులకు హాజరువుతున్నారు.

మొన్నటి భారీ వర్షాలకు ఎంపీడీఓ ఆఫీస్ మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఇప్పుడు మళ్ళీ భారీ వర్షాలు కురిస్తే.. కూలిపోయే ప్రమాదం ఉంది. ఉన్నతా ధికారులు స్పందించి ఈ బిల్డింగ్ వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయాలనీ కోరుతున్నారు. లేదంటే.. ఉద్యోగం చేయడం కష్టమని వాపోతున్నారు. నిత్యం బయపడుకుంటూ పని చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వస్తున్నారు. వెళ్తున్నారు. షిఫ్టింగ్ గురించి పట్టించుకోవడం లేదని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది పురాతన భవనము కావడంతో మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది. వర్షాలు కురిసినప్పుడు.. వేరే ఆఫీస్ లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. హెల్మెట్ ధరించి ఆఫీస్ లో పని చేయడం ఇబ్బందిగా ఉన్నా ప్రాణాన్ని కపా డుకోవడం కోసమే తప్పడం లేదంటున్నారు ఇక్కడి సిబ్బంది కనీసం ఇప్పుడైనా ఈ ఆఫీస్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.