School Holiday: బడి పిల్లలకు భలే న్యూస్.. సెప్టెంబర్ 6న సెలవొచ్చిందోచ్! ఎందుకంటే..
రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో గనంగ జరుపుకుంటున్న గణేశ్ చతుర్ధి పురస్కరించుకుని.. నిమజ్జనం రోజు సెలవు ప్రకటించింది. అంటే సెప్టెంబర్ 6న జరగనున్న గణేశ్ నిమజ్జనం రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లతోపాటు..

హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో గనంగ జరుపుకుంటున్న గణేశ్ చతుర్ధి పురస్కరించుకుని.. నిమజ్జనం రోజు సెలవు ప్రకటించింది. అంటే సెప్టెంబర్ 6న జరగనున్న గణేశ్ నిమజ్జనం రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లతోపాటు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవు వర్తించనుందని సర్కార్ తన ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోని బడులకు ఈ ప్రకటన వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే సెప్టెంబర్ 6న సెలవు కారణంగా అక్టోబర్ 11వ తేదీన వచ్చే రెండో శనివారం రోజున సెలవు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ రోజు పని దినంగా ప్రభుత్వం పేర్కొంది.
ఇక సెప్టెంబర్ 6న గణేశ్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని నిమజ్జనం జరిగే ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో అధికారులు భారీ క్రేన్‌లను ఏర్పాటు చేశారు. నిమజ్జనం ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇక నిమజ్జన ప్రక్రియను వీక్షించేందుకు హైదరాబాద్ నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు TGSRTC బుధవారం వెల్లడించింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




