Telangana: విదేశీ విద్యకు తెలంగాణ ప్రభుత్వం సాయం.. స్కాలర్‌షిప్ కోసం ఇలా అప్లై చేసుకోండి..
ఎస్సీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోసం ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ అందిస్తున్న ప్రకటించింది. ఇందులో భాగంగానే అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని ప్రత్యేకంగా రూ. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన...

ఎస్సీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోసం ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ అందిస్తున్న ప్రకటించింది. ఇందులో భాగంగానే అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని ప్రత్యేకంగా రూ. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన ఎస్సీ విద్యార్థుల కుటుంబాల కోసం తీసుకొచ్చారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ పథకానికి ఎవరు అర్హులంటే..
* దరఖాస్తు చేసుకునే విద్యార్థి కచ్చితంగా 35 ఏళ్లలోపు ఉండాలి.
*60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* ఇక అభ్యర్థులు కచ్చితంగా జీఆర్‌ఈలో 280 మార్కులు, జీమాట్‌లో 550 మార్కులు సాధించి ఉండాలి.
* అలాగే టోఫెల్‌లో 60 మార్కులు లేదా ఐఈఎల్‌టీఎస్‌లో 6 గ్రేడ్‌ను సాధించి ఉండాలి.
* పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసుకునే వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్సెస్, అగ్రికల్చర్ సైన్సెస్, మెడిసిన్, సోషల్ సైన్స్ వంటి వాటిలో పీజీ పూర్తి చేసి ఉండాలి.
ఎంత వరకు స్కాలర్ షిప్ లభిస్తుంది..
* అడ్మిషన్ లెటర్ ఆధారంగా రూ. 20 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందిస్తారు.
* వన్ వే ఎకానమీ ఫ్లైట్ చార్జీలను ప్రభుత్వమే అందిస్తుంది. విసా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది.
ఏయే దేశాలకు వెళ్లేవారికి..
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కాలర్ షిప్ ద్వారా అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో చదువుకునే వారికి ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




