Hyderabad Blast: హైదరాబాద్‌లో బాంబు పేలుడు కలకలం.. పారిశుధ్య కార్మికురాలు మృతి

హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లిలో బాంబు పేలుడు కలకలం రేపుతోంది. ఈ పేలుడులో సుశీలమ్మ అనే పారిశుధ్య కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందింది.

Hyderabad Blast: హైదరాబాద్‌లో బాంబు పేలుడు కలకలం.. పారిశుధ్య కార్మికురాలు మృతి
Police
Balaraju Goud

|

Feb 27, 2022 | 12:39 PM

Hyderabad Blast: హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లిలో బాంబు పేలుడు కలకలం రేపుతోంది. ఆనంద్‌ నగర్‌ పారిశ్రామిక వాడలో బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగింది. పారిశుధ్య సిబ్బంది చెత్త సేకరిస్తుండగా బాంబు ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడులో సుశీలమ్మ అనే పారిశుధ్య కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. బాంబు పేలుడపై భిన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

హైదరాబాద్‌ శివారు ప్రాంతం ఆదివారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆనంద్‌ నగర్‌ పారిశ్రామిక వాడలోని ఓ చెత్త కుండీలో పేలుడు సంభవించింది. దీంతో హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెత్తను సేకరించేందుకు సుశీలమ్మ, ఆమె భర్త ఉదయం ఆటోలో ఆనంద్‌ నగర్‌ పారిశ్రామిక వాడకు వెళ్లారు. అయితే వారు చెత్త సేకరిస్తున్న సమయంలో బాంబు ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడులో సుశీలమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె భర్త రంగముని తీవ్ర గాయలపాలయ్యారు. దీంతో స్థానికుల సహాయంతో రంగమునిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసలు తెలిపారు.

పేలుడు జరిగినప్పుడు పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో సుశీలమ్మ మృతదేహం ఘటన స్థలిలో చిందరవందరగా పడి ఉందని స్థానికులు తెలిపారు. వీరు నిత్యం చెత్తను సేకరించి..వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తారు. అందుకే వీరు పారిశ్రామికవాడలోని వ్యర్థాలను సేకరించేందుకు ఆటోలో వచ్చారు. సమాచారం అందుకున్న శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని…పేలుడుకు గల కారణాలపై ఆరా తీశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read Also…

ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరయ్యాడు.. గర్భం దాల్చడంతో పరారయ్యాడు.. కట్ చేస్తే

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu