Telangana: ‘ఊరంతా భయంభయంగా..’ ఆ ఇంట్లో హఠాత్తుగా ఎగసిపడుతోన్న మంటలు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఒకే చోట అకస్మాత్తుగా నిత్యం మంటలు చెలరేగుతుండటంతో స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజు ఒకే సమయానికి, ఒకే చోట మంటలు ఎందుకు..
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఒకే చోట అకస్మాత్తుగా నిత్యం మంటలు చెలరేగుతుండటంతో స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజు ఒకే సమయానికి, ఒకే చోట మంటలు ఎందుకు చెలరేగుతున్నాయో తెలియక తికమక మడుగున్నారు. అసలేం జరిగిందంటే..
మల్హర్ మండలంలోని తాడిచెర్ల గ్రామానికి చెందిన మందపెల్లి పోచయ్య ఇంట్లో నాలుగు రోజులుగా ఇంట్లో ఒకే చోట అకస్మాత్తుగా మంటలు చెలరేగుతున్నాయి. గత శనివారం ఉదయం 8 గంటలకు నిప్పు చెలరేగడంతో కుటుంబ సభ్యులు మంటలను ఆర్పేశారు. షార్ట్ షర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయేమోనని భావించి కరెంట్ సరఫరాను నిలిపివేశారు. అదే ఆ తర్వాత రోజు కూడా అదే సమయానికి అదే స్థలంలో మంటలు ఎగసిపడ్డాయి. ఇలా వరుసగా మంగళవారం (జూన్ 6) వరకు ప్రతి రోజూ మంటలు ఎగిసిపడుతున్నాయి. నాలుగు రోజులుగా మంటలు మాటిమాటికి చెలరేగుతుండంతో వస్తువులు కాలిపోతున్నాయని పోచయ్య కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక భయంతో బిక్కు బిక్కు మంటూ ఇంట్లో గడుపుతున్నారు. దీనిపై రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందిచారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకొన్న రెవెన్యూ సిబ్బంది మంటలు చెలరేగడానికి భూ గర్భ గ్యాస్ లీకేజా, లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ వార్త ఊరు మొత్తం వ్యాపించడంతో తాడిచెర్ల గ్రామ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అధికారులు స్పందించి మంటలకు గల కారణాలు తెలుసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.