AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: స్కూళ్లకు అకాడమిక్ క్యాలెండర్ విడుదల.. దసరా, సంక్రాంతి సెలవులు ఇవిగో..

తెలంగాణలో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు కాగా..

Telangana: స్కూళ్లకు అకాడమిక్ క్యాలెండర్ విడుదల.. దసరా, సంక్రాంతి సెలవులు ఇవిగో..
Telangana Students
Ravi Kiran
|

Updated on: Jun 07, 2023 | 10:05 AM

Share

తెలంగాణలో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు కాగా.. ముందుగా అనుకున్నట్లే జూన్ 12 నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది. అలాగే వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి పనిదినంగా నిర్ణయించారు. ఇకపై తెలంగాణలో స్కూల్‌ పిల్లలకు నెలలో నాలుగో శనివారం నో బ్యాగ్‌ డే అని అధికారులు తెలిపారు. ఆరోజు పిల్లలకు పుస్తకాల నుంచి విముక్తి.. రోజంతా ఆటపాటలు ఉండనున్నాయి. అటు వారానికి 3 నుంచి 5 పీరియడ్లు ఆటలు తప్పనిసరి చేశారు. రోజూ 30 నిమిషాల పాటు పుస్తకాలు చదివడంతో పాటు.. 5 నిమిషాల పాటు పిల్లలతో యోగా, ధ్యానం చేయించాలన్నారు. ఇక పదో తరగతి సిలబస్‌ 2024 జనవరి 10 నాటికి పూర్తి చేయనున్నారు. 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఒకటి నుంచి తొమ్మిది తరగతుల విద్యార్ధులకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహిస్తారు.

సెలవుల విషయానికొస్తే.. ఈసారి దసరా సెలవులను 14 రోజుల నుంచి 13 రోజులకు కుదించారు. అక్టోబర్ 14 నుంచి 25 వరకు ఈ సెలవులు ఉండనున్నాయి. క్రిస్మస్‌ సెలవులను కూడా ఏడు నుంచి అయిదుకు తగ్గించారు. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ప్రతి నెల మూడో శనివారం పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌ నిర్వహించాలి. ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాలి. ఇక నాలుగో శనివారం నో బ్యాగ్‌ డే రోజూ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనుంది పాఠశాల విద్యాశాఖ. కాగా, 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకాడమిక్‌ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ.