AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fever Survey: తెలంగాణ రాష్ట్రంలో ఫీవర్‌ సర్వే.. 4 లక్షల మందిలో కోవిడ్‌ లక్షణాలు..ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ నివేదిక..!

Fever Survey: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్‌ కొత్త కొత్త వేరియంట్లతో జనాలను భయాందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో దేశ వ్యాప్తంగా..

Fever Survey: తెలంగాణ రాష్ట్రంలో ఫీవర్‌ సర్వే.. 4 లక్షల మందిలో కోవిడ్‌ లక్షణాలు..ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ నివేదిక..!
Subhash Goud
|

Updated on: Jan 31, 2022 | 7:32 AM

Share

Fever Survey: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్‌ కొత్త కొత్త వేరియంట్లతో జనాలను భయాందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. థర్డ్‌వేవ్‌ రూపంలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. ఇక తెలంగాణలో కూడా థర్డ్‌ వేవ్‌ రూపంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే చేపట్టింది. రాష్ట్రంలో ఇంటింటా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పుల సమస్యలు తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఫీవర్‌ సర్వేలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవల్లో ఈ విషయాన్ని గుర్తించారు. కేవలం 9 రోజుల వ్యవధిలోనే మొత్తం 4,00,283 మందిలో కొవిడ్‌ లక్షణాలున్నట్లు సర్వే ద్వారా గుర్తించారు అధికారులు. మొత్తం 90లక్షల పైగా ఇళ్లలోనూ, ఆసుపత్రి ఓపీల్లో మరో 6.58 లక్షల మందిని పరిశీలించగా పై విషయం నిర్ధారణ అయింది. అయతే వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ కాకపోయినా..3,97,898 మందికి ఔషధ కిట్లు అందించారు. జనవరి 21 నుంచి 29వ తేదీ వరకు ఫీవర్‌ సర్వే, కొవిడ్‌ ఓపీ సేవల్లో భాగంగా కిట్లను పంపిణీ చేశారు. రెండో విడత సర్వే జగిత్యాల, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, నిర్మల్‌, వనపర్తి, నిజామాబాద్‌, భద్రాద్రి, మంచిర్యాల, ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ప్రారంభమైంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,170 ఓపీ కేంద్రాలను నిర్వహించగా.. 6,58,879 మందిలో జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పిలు తదితర సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో 94,910 మందికి కొవిడ్‌ లక్షణాలున్నట్లు వైద్యసిబ్బంది గుర్తించారు. వారికి కొవిడ్‌ కిట్లు అందజేశారు. ఓపీ సేవల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 1,70,962 మంది వైద్యులను సంప్రదించారు. ఇక్కడ 18,758 కిట్లను అందించారు. ఆతర్వాత భద్రాద్రి కొత్తగూడెం- 9,170, మేడ్చల్‌ మల్కాజిగిరి- 8,278, ఖమ్మం – 5,346, నల్గొండ -4,374, రంగారెడ్డి 3,856-, సంగారెడ్డి -3,138, కరీంనగర్‌ – 3,123, మంచిర్యాల – 3,093, పెద్దపల్లి -2,897, నిజామాబాద్‌ -2,833, నాగర్‌కర్నూల్‌ -2,804, యాదాద్రి భువనగిరి -2,503, సిద్దిపేట -2,135 జిల్లాల్లో అత్యధిక మెడిసిన్‌ కిట్లను అందించారు. ఇక అతి తక్కువగా మహబూబాబాద్‌ జిల్లాలో 185 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

తెలంగాణ వ్యాప్తంగా 16,258 వైద్య బృందాలు 9 రోజుల్లోనే 90,54,725 ఇళ్లలో ఫీవర్‌ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 3,05,373 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మెడిసిన్‌ కిట్లను అందించారు వైద్యులు. ఇక మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఎక్కువగా 5,45,300 ఇళ్లలో జ్వర సర్వే చేశారు. హన్మకొండ జిల్లాలో సైతం కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఉన్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది.

ఇవి కూడా చదవండి:

Telangana Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి.. గత 24 గంటల్లో..

AP Corona: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న మరణాలు.. తాజా అప్డేట్స్..