Telangana Elections: కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో దాఖలు చేసిన ఆస్తుల విలువ ఎంతంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ నుంచి అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. రేపటితో నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేసే వారు తమ అఫిడవిట్ పత్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం అధికారులు చెప్పిన నిబంధనల ప్రకారం పోటీ చేసే వారు తమ ఆస్తుల, కేసుల వివరాలు రిటర్నింగ్ అధికారులకు ప్రకటించాలి. ఈ ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన రెండు సెట్ల అఫిడవిట్లను దాఖలు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ నుంచి అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. రేపటితో నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేసే వారు తమ అఫిడవిట్ పత్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం అధికారులు చెప్పిన నిబంధనల ప్రకారం పోటీ చేసే వారు తమ ఆస్తుల, కేసుల వివరాలు రిటర్నింగ్ అధికారులకు ప్రకటించాలి. ఈ ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన రెండు సెట్ల అఫిడవిట్లను దాఖలు చేశారు. అందులో తన ఆస్తుల, అప్పుల వివరాలను పేర్కొన్నారు.
నామినేషన్ తరువాత కామారెడ్డి బహిరంగ సభలో తమ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు. ఈరోజు ఏకాదశి మంచి ముహూర్తం చూసుకుని గజ్వేల్ ఆర్టీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. ఈ అఫిడవిట్లలో పొందుపరిచిన ఆస్తులు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికల అఫిడవిట్లో నమోదు చేసిన వివరాల ప్రకారం కేసీఆర్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయి. తెలంగాణ కోసం పోరాడే సందర్భంలో ధర్నాలు, బంద్‌లతో పాటూ రాస్తారోకోలు నిర్వహించారు. దీని కారణంగా కేసులు నమోదు చేశారు పోలీసులు.
వాహనాలు.. బంగారు ఆభరణాలు
కేసీఆర్ పేరు మీద ఒక్క బైక్, కారు లేదని హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, జేసీబీతో పాటూ ఇతర వాహనాలు ఉన్నాయి. వీటి మొత్తం సంఖ్య 14గా పేర్కొన్నారు. వీటి విలువ రూ. 1.16 కోట్లుగా పొందుపరిచారు. ఇక బంగారం విషయానికి వస్తే.. 2.8 కేజీల బంగారం ఉన్నట్లు వాటి విలువ రూ. 17లక్షలుగా వెల్లడించారు. తనతోపాటూ తన భార్యకు ఒక సెంటు భూమి కూడా సొంతంగా లేదన్నారు. అందరికీ కలిపి ఉమ్మడి ఆస్తిగా 62 ఎకరాల భూమిని చూపించారు.
అప్పులు.. ఆస్తులు
ప్రస్తుతం తన వద్ద రూ. 2లక్షల 96వేల రూపాలయలు నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ సతీమణి శోభమ్మ పేరు మీద రూ. 17కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు చూపించారు. 2018లో చూపించిన దానితో పోల్చితే దాదాపు రెండింతలు ఆదాయం పెరిగినట్లు తెలుస్తోంది. గతంలో సేవింగ్స్, ఎఫ్డీలు కలిపి రూ. 5.63 కోట్లు కాగా ఇప్పుడు రూ. 11.16కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2018లో శోభమ్మ చేతిలో ఉన్న నగదు రూ. 94వేలు కాగా ఇప్పుడు రూ. 6.29 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. కేసీఆర్‌కు రూ. 17.83 కోట్లు స్థిరాస్తులు ఉండగా.. చరాస్తులు రూ. 9.67 కోట్లు ఉన్నట్లు చూపించారు. శోభమ్మ పేరు మీద రూ. 7.78 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఇద్దరికీ కలిపి ఉమ్మడి ఆస్తి కింద రూ. 9.81 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఇక అప్పు విషయానికొస్తే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రూ. 17.27 కోట్లు అప్పు ఉందని చూపించారు. కుటుంబానికి సంబంధించి రూ. 7.23 కోట్లు అప్పు ఉన్నట్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








