Telangana Election Results: కామారెడ్డిలో ఉత్కంఠ.. ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థులు వీరే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అధిక్యత సాధించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకునే దిశగా పరుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గం ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Telangana Election Results: కామారెడ్డిలో ఉత్కంఠ.. ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థులు వీరే!
Congress Brs
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 03, 2023 | 2:32 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అధిక్యత సాధించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకునే దిశగా పరుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గం ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు వెలువడిన ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఒకసారి పరిశీలిద్దాం..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో BRS పార్టీ హవా కొనసాగింది. 10 సీట్లలో 7 చోట్ల BRS అభ్యర్థుల ఆధిక్యత సంపాదించారు. కేవలం 3 చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థుల లీడింగ్‌లో ఉన్నారు. దుబ్బాక, పటాన్‌చెరు, నర్సాపూర్‌, గజ్వేల్‌, సిద్దిపేట, సంగారెడ్డి, జహీరాబాద్‌లో బీఆర్ఎస్‌ జోరు కొనసాగుతోంది. మెదక్‌, అందోల్‌, నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యత కనబరుస్తుంది.

ఇక ఇప్పటివరకు వెలువడి ఫలితాల్లో.. బీఆర్‌ఎస్‌ – భద్రాచలంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు అంబర్‌పేటలో కాలేరు వెంకటేష్‌(బీఆర్‌ఎస్‌) గెలుపు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌) విజయం. బాన్సువాడలో పోచారం (బీఆర్‌ఎస్‌) విజయం. బాల్కొండలో ప్రశాంత్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌) విజయం.

కాంగ్రెఎస్‌ –

మెదక్‌లో మైనంపల్లి రోహిత్‌(కాంగ్రెస్‌) విజయం హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌(కాంగ్రెస్‌) విజయం నకిరేకల్‌లో వేముల వీరేశం(కాంగ్రెస్) విజయం కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌) విజయం నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డి (కాంగ్రెస్‌) గెలుపు జుక్కల్‌లో లక్ష్మీకాంతరావు (కాంగ్రెస్) విజయం నాగార్జునసాగర్‌లో జయవీర్‌రెడ్డి(కాంగ్రెస్‌) విజయం ఎల్లారెడ్డిలో మదన్‌ మోహన్ (కాంగ్రెస్‌) విజయం బెల్లంపల్లిలో వినోద్‌ (కాంగ్రెస్‌) విజయం మంథనిలో శ్రీధర్‌బాబు(కాంగ్రెస్‌) విజయం నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి(కాంగ్రెస్‌) గెలుపు ములుగులో సీతక్క (కాంగ్రెస్) గెలుపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :