Telangana Election: తెలంగాణ దంగల్‌లో భారీగా సొత్తు స్వాధీనం.. రంగంలోకి దిగిన GST, కస్టమ్స్ అధికారులు
తెలంగాణ దంగల్‌లో పట్టుబడుతున్న నోట్ల కట్టలు.. వందల కోట్లకు చేరుకున్నాయి. ఇక బంగారం, వెండి ఆభరణాలతో పాటు మద్యం బాటిళ్లు, కుక్కర్లు వంటి వస్తు సంపద వెల కట్టలేనంతగా పోగవుతున్నాయి. ఓటుకు నోట్లు కాస్తా, ఓటుకు కోట్లుగా మారిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 500 కోట్లకు పైగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
తెలంగాణ దంగల్‌లో పట్టుబడుతున్న నోట్ల కట్టలు.. వందల కోట్లకు చేరుకున్నాయి. ఇక బంగారం, వెండి ఆభరణాలతో పాటు మద్యం బాటిళ్లు, కుక్కర్లు వంటి వస్తు సంపద వెల కట్టలేనంతగా పోగవుతున్నాయి. ఓటుకు నోట్లు కాస్తా, ఓటుకు కోట్లుగా మారిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 500 కోట్లకు పైగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల సంఘం అధికారులు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో నోట్ల ప్రవాహం కొనసాగుతుంది. కోట్ల ప్రవాహంగా మారిపోయింది. పెద్ద ఎత్తున నగదు, బంగారం, వెండి, మద్యం బాటిళ్లతో పాటు కుక్కర్లు వంటి ఇతరత్రా వస్తువులు డైలీ సీరియల్‌లా రోజూ పట్టుబడుతున్నాయి. ఈ అక్రమ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులే కాకుండా GST, కస్టమ్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, ఇన్నర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కాపలా కట్టుదిట్టం చేసినా, పెద్ద ఎత్తున డబ్బు, బంగారం వెండి ఆభరణాలు, మద్యం బాటిళ్లు పట్టుబడుతూనే ఉన్నాయి.
పోలీసు, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు గత 27 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన తనిఖీల్లో నగదు, బంగారం, వెండి, మద్యం, ఇతర వస్తువులు కలిపి రూ.490.58 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేశాయి. అక్టోబరు 9న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి దాకా స్వాధీన చేసుకున్న సొత్తు విలువ సుమారు 500 కోట్ల రూపాయలకు చేరింది. ఇందులో 173 కోట్ల నగదు, 176 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. రూ. 52.51 కోట్లు విలువ చేసే కుక్కర్లు, చీరలు, వాహనాలు, మొబైల్ ఫోన్లు, క్రీడాసామగ్రి, ఇతర వస్తువులు ఉన్నాయని ఎన్నికల విభాగం అధికారులు పేర్కొన్నారు. అలాగే రూ. 60.09 కోట్లు విలువ చేసే మద్యం, రూ. 28.61కోట్లు విలువైన గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఉన్నాయని తెలిపారు. .
భారీగా నగదు, నగలు పట్టుబడుతున్న నేపథ్యంలో తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. చెక్ పోస్టులు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, ఇన్నర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులలో తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీసులకు తోడు GST, కస్టమ్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…