Ponguleti Srinivasa Reddy: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు..
IT raids on Ponguleti Srinivasa Reddy's house : ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇల్లు, కార్యాలయంలో ఏకకాలంలో ఐటీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు.. గురువారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇంటి దగ్గరకు చేరుకోగానే.. గేట్లు, తలుపులు మూసి సిబ్బంది సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాల్లో, ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి.
IT raids on Ponguleti Srinivasa Reddy’s house : ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇల్లు, కార్యాలయంలో ఏకకాలంలో ఐటీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు.. గురువారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇంటి దగ్గరకు చేరుకోగానే.. గేట్లు, తలుపులు మూసి సిబ్బంది సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాల్లో, ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని పొంగులేటి నివాసంతో పాటు రాఘవ కన్స్ట్రక్షన్స్ లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
కాగా.. పొంగులేటి కొంతకాలం క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. కాగా.. బుధవారమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులే టార్గెట్‌గా ఐటీ దాడులు జరుగుతున్నాయని.. తన ఇంటిపై కూడా దాడులు జరగవచ్చని నిన్ననే కామెంట్ చేశారు. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
పొంగులేటి ఇంటిపై ఐటీ దాడులపై.. ఆయన అనుచరుడు మువ్వా విజయ్ బాబు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈరోజు నామినేషన్ వేస్తున్న సమయంలో దాడులు చేయడం వెనక కుట్ర ఉందంటూ పేర్కొన్నారు. నామినేషన్లు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. నామినేషన్ ఆగదంటూ వ్యాఖ్యానించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..