AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E Voting: స్మార్ట్‌ఫోన్‌ నుంచే ఓటు వేయొచ్చు..! ఈ- ఓటింగ్‌ విధానంపై డ్రై రన్‌..

E Voting: తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని దేశంలో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఆధారిత 'ఈ-ఓటింగ్' యాప్‌ని

E Voting: స్మార్ట్‌ఫోన్‌ నుంచే ఓటు వేయొచ్చు..! ఈ- ఓటింగ్‌ విధానంపై డ్రై రన్‌..
Evoting App
uppula Raju
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 07, 2021 | 9:39 PM

Share

E Voting: తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని దేశంలో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఆధారిత ‘ఈ-ఓటింగ్’ యాప్‌ని అభివృద్ధి చేస్తోంది. ఈ యాప్‌ని పరీక్షించడానికి ఖమ్మం జిల్లాలో డమ్మీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్‌, రాష్ట్ర ఐటీ అండ్‌ సీ విభాగం, సీడాక్‌ కలిసి రూపొందించిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఎలక్షన్‌ విధానాన్ని ఐఐటీ భిలాయి డైరెక్టర్‌ రాజత్‌ మూనా అధ్యక్షతన పరీక్షించనున్నారు.

జిల్లాలోని పౌరులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. ప్రకటన ప్రకారం వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, నోటిఫైడ్ ఎసెన్షియల్ సర్వీసులలో పనిచేసే పౌరులు, జబ్బుపడిన వ్యక్తులు, పోలింగ్ సిబ్బంది, ఐటి నిపుణులు వంటి వారికి ఓటుహక్కు కల్పించడం ఈ-ఓటింగ్ లక్ష్యం. ఈ విధానంలో కృత్రిమ మేథ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను వినియోగించనున్నారు. ఈ సాంకేతికతల సాయంతో 3 సార్లు ఓటరు అథెంటిఫికేషన్ చేయనున్నారు. ఓటరు పేరు, ఆధార్, లైవ్ లొకేషన్, ఇమేజ్ మ్యాచింగ్ వంటివి సరిచూడనున్నారు.

బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఆన్ లైన్ ఫార్మేట్ లో వేసిన ఓట్లు చెరిగిపోకుండా తిరిగి లెక్కించటానికి దోహదపడుతుంది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఈ డేటా అంతా స్టేట్ డేటా సెంటర్ లో భద్రపరుస్తారు. ఫలితాల ఉత్పత్తిని మరింత సురక్షితంగా ఉంచడానికి భౌతిక భద్రతా టోకెన్ ఆధారిత డిక్రిప్షన్ అవసరంతో, మొత్తం ప్రక్రియను వెబ్ పోర్టల్ ఉపయోగించి పర్యవేక్షించవచ్చు. అంతేకాదు నియంత్రించవచ్చు కూడా. ఇందులో ప్రొఫెసర్ రజత్ మూనా, ఐఐటి భిలాయ్, భారత ఎన్నికల కమిషన్ సాంకేతిక సలహాదారు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్‌లు పాల్గొంటారు.

Malaria Vaccine: ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్.. పిల్లల కోసం ఆమోదించిన WHO

Karnataka: విషాదం.. కర్ణాటకలో ఇల్లు కూలి ఏడుగురి మృతి..

IPL 2021 RCB vs SRH: ఆర్సీబీపై ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్‌.. ఉమ్మడిగా రాణించిన బౌలర్లు..