Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malaria Vaccine: ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్.. పిల్లల కోసం ఆమోదించిన WHO

Malaria Vaccine: ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటిసారిగా పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్ సిఫార్సు చేసింది. WHO దీని గురించి ట్వీట్ కూడా చేసింది.

Malaria Vaccine: ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్.. పిల్లల కోసం ఆమోదించిన WHO
Malaria
Follow us
uppula Raju

|

Updated on: Oct 07, 2021 | 12:41 AM

Malaria Vaccine: ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటిసారిగా పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్ సిఫార్సు చేసింది. WHO దీని గురించి ట్వీట్ కూడా చేసింది. దోమల ద్వారా సంక్రమించే మలేరియా ప్రతి సంవత్సరం వందల మందిని చంపుతుంది. ప్రతి రెండు నిమిషాలకు ఒక పిల్లవాడు మలేరియాతో మరణిస్తున్నట్లు WHO ట్వీట్ చేసింది. అధిక మలేరియా వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో పిల్లల మరణాలను తగ్గించడానికి WTS RTS, S మలేరియా వ్యాక్సిన్‌ను సిఫార్సు చేస్తోంది.

2025 నాటికి ప్రపంచం నుంచి మలేరియాను నిర్మూలించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం వారు తీవ్రంగా పని చేస్తున్నారు. 25 దేశాలలో నిర్మూలన కార్యక్రమం కూడా ప్రారంభించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా వ్యాక్సిన్‌ను ఉప-సహారా ఆఫ్రికాలో ఉన్న పిల్లలలో విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించింది. మలేరియా వ్యాప్తి ఆఫ్రికన్ దేశాలలో ఎక్కువగా ఉంది. మలేరియాతో ప్రతి సంవత్సరం దాదాపు 260,000 ఆఫ్రికన్ పిల్లలు మరణిస్తున్నారు.డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డా. “ఇది చారిత్రాత్మక క్షణం” అని డాక్టర్ టెడ్రోస్ చెప్పారు. మలేరియాను నివారించడానికి ఇప్పటికే ఉన్న పరికరాల పైన ఈ మలేరియా వ్యాక్సిన్‌ను ఉపయోగించడం వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది యువకుల ప్రాణాలను కాపాడవచ్చు.

TS, S / AS01 మలేరియా వ్యాక్సిన్ WHO ద్వారా ఉపయోగం కోసం ఆమోదించబడిన టీకా శాస్త్రీయ నామం RTS, S / AS01. WHO సంస్థ రెండు అతిపెద్ద సలహా సంస్థల ఆధారంగా సిఫార్సు చేసింది. 5 నెలల పైబడిన పిల్లలకు ఈ టీకా ఇవ్వబడుతుంది. పిల్లలకు మొత్తం నాలుగు మోతాదులు ఉంటాయి. ఇప్పటివరకు, మూడు ఆఫ్రికన్ దేశాలలో 2.3 మిలియన్ డోసుల టీకా ఇచ్చారు. ఈ టీకా పూర్తిగా సురక్షితం అని నిరూపించారు.

మలేరియా వ్యాధికి ప్రధాన కారణం దోమకాటు. ఏడాది క్రితం మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేస్తోంది. కంటికి కనిపించకుండా లక్షలాది మంది ప్రాణాలను చిదిమేస్తోంది. కాగా, కంటికి కనిపించే దోమలు వచ్చి శతాబ్దాలైంది. అయినా మనం వాటిని ఏమీ చెయ్యలేకపోతున్నాం. ముఖ్యంగా దోమల ద్వారా సంక్రమించే మలేరియా.. ప్రాణాలు తీసేస్తోంది. అయినా సరే మనం ఇన్నేళ్లుగా వ్యాక్సిన్ తయారుచేసుకోలేకపోయాం.

Karnataka: విషాదం.. కర్ణాటకలో ఇల్లు కూలి ఏడుగురి మృతి..