Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate:’మా’ ఎన్నికల్లో జీవిత రాజశేఖర్ డబుల్ గేమ్ అడుతున్నారా?

Big News Big Debate: ‘మా’ ఎన్నికల్లో జీవిత డబుల్‌ గేమ్‌‌ ఆడుతున్నారా.? ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి జీవిత పోటీచేస్తుంటే.. రాజశేఖర్‌ మాత్రం మంచు ఫ్యామిలీతో టచ్‌లోకి వెళ్లారా?

Big News Big Debate:’మా’ ఎన్నికల్లో జీవిత రాజశేఖర్ డబుల్ గేమ్ అడుతున్నారా?
Big News Big Debate On Jeevita Moments In Maa Elections 2021 Fight Video
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 06, 2021 | 8:52 PM

Big News Big Debate: మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ‘మా’ ఎన్నికల్లో జీవిత డబుల్‌ గేమ్‌‌ ఆడుతున్నారా.? ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి జీవిత పోటీచేస్తుంటే.. రాజశేఖర్‌ మాత్రం మంచు ఫ్యామిలీతో టచ్‌లోకి వెళ్లారా? అధ్యక్షుడిగా బరిలో ఉన్న మంచు విష్ణు కొత్తగా జీవితకు వార్నింగ్‌ ఇవ్వడం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతోంది. మా అసోసియేషన్ వార్ అంతా కూడా‌ జీవితా సెంట్రిక్‌గా ఎందుకు నడుస్తోంది? టాలీవుడ్‌నే నమ్ముకున్న ఫ్యామిలీల్లో జీవిత రాజశేఖర్‌ ఉంటారు. నిర్మాతలుగా, దర్శకులుగా నటులుగా దశాబ్ధాలుగా పరిశ్రమలో ఉన్న ఈ కుటుంబం వివాదాల్లోనూ తరచూ కనిపిస్తుంటారు. లేటెస్టుగా మా అసోసియేషన్ ఎన్నికల్లోనూ వారే హాట్‌ టాపిక్‌ అయ్యారు.

మా అసోసియేషన్‌ ఎన్నికల్లో మిత్రులే శత్రువులుగా మారుతున్నారు. ఎన్నికల పుణ్యమా అని ఒకరిపై ఒకరు డైలాగులు పేల్చుకుంటున్నారు. మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్‌రాజ్‌ యుద్ధం కాస్తా.. ఇప్పుడు జీవిత వర్సెస్‌ మంచు ఫ్యానల్‌గా మారింది.

నిన్నమొన్నటిదాకా కలిసికట్టుగా ఉన్న అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరేష్‌, జీవిత రాజశేఖర్‌లు పరస్పర ఆరోపణలతో వీధికెక్కుతున్నారు. ప్రకాష్‌రాజ్‌ తెరమీదకు వచ్చిన వెంటనే అసలు ఎన్నికలేంటి.. తొలి మహిళా ప్రెసిడెంట్‌గా కావాలంటే జీవితను ఏకగ్రీవం చేసుకుందామన్న నరేష్‌.. ఇప్పుడు ఆమె పేరు చెబితేనే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆంటీ ఆంటీ అంటూ ఆత్మీయంగా పిలిచిన మంచి విష్ణు.. మర్యాద దక్కదంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

మరోవైపు, జీవితపై మంచు విష్ణు పేల్చిన డైలాగులు చూస్తే ఆమె డబుల్ గేమ్‌ ఆడుతుందా అన్న సందేహం కలుగుతోంది. రాజశేఖర్‌ తమ ఇంటికి వచ్చారన్న వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఇప్పుడు కాక రేపుతున్నాయి. అటు, ఓటు వేయవద్దు అంటూ జీవిత చేసిన వ్యాఖ్యలపై నరేష్‌ ఫైర్‌ అయ్యారు. అధ్యక్షుడిగా ఆమెపై చర్యలు తీసుకునే అధికారం ఉన్నా వదిలేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

‘మా’ అసోసియేషన్ ఎన్నికల్లో మహిళలు చాలామంది పోటీలో ఉన్నా.. జీవిత సెంట్రిక్‌గా పోల్‌ స్ట్రాటజీ నడుస్తున్నట్టుగా ఉంది. వీరి చుట్టూనే విమర్శలు చక్కర్లు కొడుతన్నాయి. గతంలో ఓ డైరీ ఫంక్షన్‌ లో రాజశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు… తర్వాత పరిణామాలు కూడా ఇప్పుడు ఎజెండాలో ప్రత్యర్ధులు చేర్చి మరి రచ్చ చేస్తున్నారు. ఇంతకీ జీవితా రాజశేఖర్‌ అంటేనే వివాదాలకు కేరాఫా? లేక అలా ప్రచారం చేస్తున్నారా?

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి. Read Also… PM Modi: ప్రజల ఇబ్బందులు స్వయంగా చూశా.. పదవులకన్నా ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ..!(వీడియో)