Telangana: అబ్బ.. పార్ట్ టైం జాబ్.. లచ్చలు లచ్చలు వస్తాయ్.. అంటూ సంబరపడ్డాడు.. కట్ చేస్తే..
ఆన్లైన్వేదికగా సైబర్‌నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.. మనుషుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. వారికి ఏదో ఒకటి ఆశచూపి.. బురిడి కొట్టించి లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు.. అచ్చం ఇలాంటి ఘటనే తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పార్ట్ టైం జాబ్చూపిస్తాం.. ఇంట్లోనే ఉండి లక్షలు లక్షలు సంపాదించుకోవచ్చు అని ఆశపెడితే నమ్మాడు ఓ యువకుడు..

ఆన్లైన్వేదికగా సైబర్‌నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.. మనుషుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. వారికి ఏదో ఒకటి ఆశచూపి.. బురిడి కొట్టించి లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు.. అచ్చం ఇలాంటి ఘటనే తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పార్ట్ టైం జాబ్చూపిస్తాం.. ఇంట్లోనే ఉండి లక్షలు లక్షలు సంపాదించుకోవచ్చు అని ఆశపెడితే నమ్మాడు ఓ యువకుడు.. వాట్సాప్‌లో సైబర్‌నేరగాళ్లు పంపిన లింక్ ఓపెన్ చేశాడు. వారు అడిగినంత ఇస్తూ.. రూ.లక్షల్లో లాభాలు కళ్లజూద్దామనుకున్నాడు. తను మోసపోతున్నా అని తేరుకునేలోపే రూ.6.58లక్షలను సైబర్ నేరగాళ్లు దోచేయడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు ఆ యువకుడు..
వివరాల ప్రకారం.. మెదక్‌జిల్లా నర్సాపూర్మున్సిపాలిటీకి చెందిన బానోత్ఉదయ్ కిరణ్స్థానికంగా చిన్న వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు జూన్1వ తేదీన గుర్తుతెలియని నంబరు నుంచి వాట్సాప్‌కు ఒక మెసేజ్ వచ్చింది. పార్ట్ టైం జాబ్ చేయడానికి ఆసక్తి ఉందా ? అనేది దాని సారాంశం..అది నిజమేనని ఉదయ్ కిరణ్నమ్మాడు. వారు ఇచ్చిన లింక్ఓపెన్చేశాడు. ఒక వెబ్‌సైట్ కనిపించింది. అందులో బోనస్పాయింట్స్అంటూ రూ.10,870 ఇచ్చారు. ఆ తర్వాత రూ.10,000 ఇన్వెస్ట్ చేయాలన్నారు. సరేనంటూ గూగుల్‌పే చేశాడు. దీంతో అతడికి రూ.1,100 ప్రాఫిట్అంటూ పంపించారు. క్రమంగా ఉదయ్ కిరణ్ కు ఆశ, నమ్మకం కల్పించి దోపిడీకి తెరలేపారు..
ఆ మరుసటి రోజే మరో రూ.10వేలు పంపమన్నారు. వారు చెప్పినట్లే ఉదయ్ కిరణ్ చేశాడు. సైబర్ నేరగాళ్లు అతడి పేరిట ఒక ఖాతా క్రియేట్‌చేశారు. అందులో మైనస్‌గా ఉన్న రూ. 23,290 క్లియర్చేయాలన్నారు. మరోసారి గూగుల్‌పే చేశాడు. వెంటనే వాళ్లు అతడికి రూ.10వేలు వెనక్కి పంపారు. అలా పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. రూ.30వేలు పంపితే.. రూ.9వేలు ప్రాఫిట్ఇచ్చారు. అసలు కూడా తిరిగి ఇస్తామన్నారు. దీంతో ఉదయ్ కిరణ్ ఆశపడ్డాడు. అలా వారికి డబ్బులు గూగుల్‌పే చేస్తూనే ఉన్నాడు. చివరకు రూ.6.58లక్షలు క్లియర్ చేస్తే, ఇంకా లాభాలు వస్తాయన్నారు. సరేనని అలాగే చేశాడు. కానీ ప్రాఫిట్ ఇవ్వకపోగా.. చివరగా రూ.10.82లక్షలు క్లియర్ చేయాలన్నారు.. దీంతో తాను మోసపోయాననే విషయాన్ని ఉదయ్ కిరణ్ గ్రహించాడు. వెంటనే 1930కి కాల్ చేశాడు. ఫిర్యాదు అందించాడు.
తక్షణమే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగారు. నేరగాళ్ల ఖాతాల్లోకి బదిలీ కాకుండా ఉన్న రూ.80,642 హోల్డ్చేశారు. ఈ ఘటనపై పోలీసులు చేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఊరికే ఎవరైనా లాభాలు వచ్చేలా చేస్తామంటే ఆశపడొద్దని పోలీసులు పదే పదే చెబుతున్నా.. ఇంకా చాలా మంది సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ఎవరూ ఉచితంగా డబ్బులు ఇవ్వరనే విషయాన్ని గ్రహిస్తేనే, ఈ నేరాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని.. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
