Telangana: ఉద్యోగం కోసం కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన కి’లే’డీ..!
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఏకంగా వికారాబాద్ కలెక్టర్ సంతకంతో ఫేక్ అపాయింట్మెంట్ కాపీ ఇచ్చింది ఓ మహిళ. బదిలీపై వెళ్లిన కలెక్టర్ నిఖిల సంతకం ఫోర్జరీ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడింది. మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. మంచిర్యాల జిల్లా తంగేళ్లపల్లికి చెందిన శిరీష అలియాస్ అనూష

మంచిర్యాల, ఆగస్టు 2: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఏకంగా వికారాబాద్ కలెక్టర్ సంతకంతో ఫేక్ అపాయింట్మెంట్ కాపీ ఇచ్చింది ఓ మహిళ. బదిలీపై వెళ్లిన కలెక్టర్ నిఖిల సంతకం ఫోర్జరీ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడింది. మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే..
మంచిర్యాల జిల్లా తంగేళ్లపల్లికి చెందిన శిరీష అలియాస్ అనూష హైదరాబాద్ కు చెందిన వాణిరెడ్డికి వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగ మంటూ రెండు లక్షల యాభై వేల రూపాయల వరకూ వసూళ్లు చేసింది. వికారాబాద్ జిల్లా మాజీ కలెక్టర్ నిఖిల పేరుమీద అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది. అది ఫేక్ అపాయింట్‌మెంట్ అని తెలియక జాయిన్ కావడానికి వాణిరెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది.
అయితే బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదని గ్రహించిన ఉద్యోగులు ఆ లెటర్ ఫేక్ గా వాణి రెడ్డికి చెప్పడంతో ఆమె షాక్ కు గురి అయింది. మోసపోయానని గ్రహించి వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వాణి రెడ్డి. ఆమె ఫిర్యాదుతో అనూషను అరెస్టు చేసి డబ్బులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు పోలీసులు. జిల్లా కలెక్టర్ సంతకాన్ని కాపీ చేసీ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన మహిళను చూసి ఉద్యోగులు కంగుతిన్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
