Coronavirus: తెలంగాణను భయపెడుతున్న కరోనా… గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఎన్ని కేసులంటే..
Coronavirus: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో
Coronavirus: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టినా.. గత నెల రోజుల నుంచి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 62,973 మందికి పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1321 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కరోనాతో ఐదుగురు మృతి చెందగా, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 1717కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 3,12,140కి చేరగా, నిన్న ఒక్క రోజు కరోనా నుంచి 293 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,923 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 3,886 మంది బాధితులు హోంఐసోలేషన్‌లో ఉన్నారు. మరో వైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతి రోజు కేసులు చాలా నమోదవుతున్నాయి. తాజాగా 320 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
SBI Customer Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత.. వెల్లడించిన ఎస్‌బీఐ