AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Customer Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత.. వెల్లడించిన ఎస్‌బీఐ

SBI Customer Alert: స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియా మెరుగైన సేవలు అందించడంలో భాగంగా అప్‌గ్రేడ్‌ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఎస్‌బీఐ తన కస్టమర్లను..

SBI Customer Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత.. వెల్లడించిన ఎస్‌బీఐ
Sbi
Subhash Goud
|

Updated on: Apr 04, 2021 | 11:32 AM

Share

SBI Customer Alert: స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియా మెరుగైన సేవలు అందించడంలో భాగంగా అప్‌గ్రేడ్‌ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఎస్‌బీఐ తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఆదివారం మధ్యాహ్నం 3.25 గంటల నుంచి సాయంత్రం 5.25 గంటల వరకు రెండు గంటల పాటు ఎస్‌బీఐ సేవలు నిలిచిపోనున్నట్లు ఎస్‌బీఐ ట్వీట్‌లో పేర్కొంది. బ్యాంకుకు సంబంధించిన కార్యకలాపాల కారణంగా వినియోగదారులురెండు గంటలు రెండు గంటలు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌, యోనో లైట్‌ సేవలకు అంతరాయం కలుగుతుందని తెలిపింది. ఇందుకు వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. రెండు గంటల పాటు నిలిచిపోయే సేవలకు సహకరించాలని బ్యాంక్ తెలిపింది.

కాగా, బ్యాంకుకు సంబంధించిన అప్‌గ్రేడ్‌ పనుల కారణంగా ఏప్రిల్‌ 1న మధ్యాహ్నం 2.10 నుంచి సాయంత్రం 5.40 గంటల వరకు కూడా బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోయాయని, అలాగే ఆదివారం కూడా రెండు గంటల పాటు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

అయితే మెరుగైన ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు అందించడం కోసం ప్రస్తుతం అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది. భారతదేశంలో బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద సంస్థ అయిన ఎస్‌ఐబీ కావడంతో చాలా మంది కస్టమర్లపై ప్రభావం పడనుంది.

ఇవీ చదవండి: Top Smartmobiles: ఏప్రిల్‌ నెలలో భారత్‌లో విడుదల కానున్న టాప్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Robot artist: ఏం క్రియేటివిటి గురూ.. ఈ రోబో వేసిన పెయింటింగ్‌ ఎంత ధర పలికిందో తెలిస్తే షాకవుతారు..!