AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Corona: తెలంగాణలో కొత్తగా 648 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు మరణాల సంఖ్య ఇలా

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,14,928 సాంపిల్స్ పరీక్షించగా.. 648 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Telangana Corona: తెలంగాణలో కొత్తగా 648 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు మరణాల సంఖ్య ఇలా
Sanjay Kasula
|

Updated on: Jul 22, 2021 | 8:31 PM

Share

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,14,928 సాంపిల్స్ పరీక్షించగా.. 648 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,39,369 మంది కరోనా బారిన పడ్డారు. ఇక ఒక్క రోజులో 696 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారితో కలిపి ఇప్పటి వరకు 6,25,738 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఈ మహమ్మారి కారణంగా ఒక్క రోజులో ముగ్గురు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కరోనా వైరస్ ప్రభావంతో 3,774 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో రికవరీ రేటు97.86 శాతం ఉంది. మరణాట రేటు 0.59 శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 9,857 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 82 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో వరంగల్ అర్బన్‌లో నమోదు అయ్యాయి.

తెలంగాణలో జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ – 6, బద్రాద్రి కొత్తగూడెం – 26, జీహెచ్ఎంసీ – 82, జగిత్యాల – 20, జనగామ – 7, జయశంకర్ భూపాలపల్లి – 8, జోగులాంబ గద్వాల – 7, కామారెడ్డి – 1, కరీంనగర్ – 55, ఖమ్మం – 46, కొమరంభీం ఆసిఫాబాద్ – 6, మహబూబ్‌నగర్ – 10, మహబూబాబాద్ – 12, మంచిర్యాల – 28, మెదక్ – 4, మేడ్చల్ మల్కాజిగిరి – 35, ములుగు – 8, నాగర్ కర్నూలు – 4, నల్లగొండ – 35, నారాయణ పేట – 1, నిర్మల్ – 0, నిజామాబాద్ – 10 , పెద్దపల్లి – 28, రాజన్న సిరిసిల్ల – 18, రంగారెడ్డి – 25, సంగారెడ్డి – 11, సిద్ధిపేట – 13, సూర్యాపేట – 44, వికారాబాద్ – 4, వనపర్తి – 14, వరంగల్ రూరల్ – 9, వరంగల్ అర్బన్ – 52, యాదాద్రి భువనగిరి – 15 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా, నిర్మల్ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఈ జిల్లాల అధికారుల పనితీరును ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతానికి కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దని హితవు చెబుతున్నారు. ఒకవేళ బయటకు వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.

ఇవి కూడా చదవండి: CM KCR: భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన..

AP Inter Results 2021: ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు సాయంత్రం ఫలితాలు..

Follow Us