AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Cards: రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే మీ కార్డ్ కట్ అయినట్లే..

రేషన్ కార్డులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అర్హుల జాబితాను పరిశీలిస్తున్నాయి. అనర్హులను తొలగించే ప్రకియను వేగవంతం చేశాయి. ఇటీవల తెలంగాణలో లక్షకుపైగా అనర్హులకు కేంద్రం రేషన్ కార్డు కట్ చేసింది. రేషన్ కార్డు రద్దు చేయడానికి కారణాలేంటి..?

Ration Cards: రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే మీ కార్డ్ కట్ అయినట్లే..
Ration Cards
Venkatrao Lella
|

Updated on: Apr 05, 2026 | 11:38 AM

Share

ఇటీవల కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుల రీవెరిఫికేషన్ చేస్తోంది. అనర్హులుగా తేలిన వారిని తొలగిస్తోంది. తెలంగాణలో ఎక్కువగా రేషన్ కార్డులు రద్దు చేసింది. తెలంగాణలో దాదాపు 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించినట్లు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్దంగా చాలామంది రేషన్ కార్డు పొంది సంక్షేమ పధకాలు పొందుతున్నారు. దీని వల్ల అసలైన అర్హులకు న్యాయం జరగడం లేదు. ఈ క్రమంలో అర్హత లేకపోయినా రేషన్ కార్డులు పొందుతున్నవారిని అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. సరైన వివరణ ఇవ్వకపోతే రద్దు చేస్తున్నారు. అర్హుల జాబితాను ప్రక్షాళన చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

వీరికి కట్..

కొంతమంది కోటీశ్వరులు కూడా రేషన్ కార్డులు పొందుతున్నట్లు తేలింది. దీంతో పాన్ కార్డు వివరాలను పరిశీలించి రేషన్ కార్డులను తొలగిస్తున్నారు. రేషన్ కార్డుదారుల పాన్ కార్డు వివరాలను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా సేకరించి అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ వివరాల ఆధారంగా అనర్హులను తొలగించే ప్రక్రియ వేగవంతం చేశారు. ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించేవారితో పాటు ఖరీదైన వాహనాలు ఉన్నవారికి గుర్తించి రేషన్ కార్డు రద్దు చేస్తున్నారు. ఇక ఆదాయం ఎక్కువ ఉన్నవారికి కూడా గుర్తించి రేషన్ నిలిపివేస్తున్నారు. రేషన్ పొందేందుకు పట్టణాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామాల్లో రూ.1.50 లక్షల్లోపు ఉండాలి. అయితే నెలకు లక్ష ఆదాయం వచ్చే కుటుంబాలు కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నాయి. వీళ్లు బియ్యాన్ని తీసుకుని బ్లాక్ మార్కెట్లో విక్రయించుకుంటున్నారు. దీంతో నిజమైన లబ్దిదారులకు మాత్రమే అందించానే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి.

మరణించిన వ్యక్తుల పేర్లపై రేషన్

తెలంగాణలో 83,545 మంది మరణించిన వ్యక్తుల పేరుపై రేషన్ తీసుకుంటున్నట్లు తేలింది. ఇక పీఎం కిసాన్ డేటా ప్రకారం 52,339 మంది ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు తేలింది. ఇక 15 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు 5,866 మంది ఉన్నట్లు తేలింది. ఇక తెలంగాణలో 1.05 కోట్లకుపైగా రేషన్ కార్డులు ఉండగా.. వీటిల్లో 99.36 లక్షల కార్డులు ఆహార భద్రత కార్డులు ఉన్నాయి.

Follow Us