AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్కే లక్కు.. 25 ఏళ్ల కుర్రాడిని పెళ్లాడిన 55 ఏళ్ల మహిళ.. కట్నం ఎంతిచ్చిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని అంటారు.. కానీ ఈ వార్త వింటే మీరు ముక్కున వేలేసుకుంటారు.. 55 ఏళ్ల వయస్సు.. ఆరో పెళ్లి.. అది కూడా తనకంటే 30 ఏళ్లు చిన్నవాడైన 25 ఏళ్ల యువకుడితో.. అంతటితో ఆగకుండా పెళ్లి కొడుకుకే ఏకంగా 68 కోట్ల రూపాయల కట్నం ఇచ్చి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది ఒక మహిళా వ్యాపారవేత్త. ఈ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

లక్కే లక్కు.. 25 ఏళ్ల కుర్రాడిని పెళ్లాడిన 55 ఏళ్ల మహిళ.. కట్నం ఎంతిచ్చిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
55 Year Old Chinese Woman Marries 25 Year Old Model
Krishna S
|

Updated on: Apr 05, 2026 | 11:25 AM

Share

చైనాకు చెందిన మెడికల్ కాస్మెటిక్స్ సామ్రాజ్య అధినేత్రి యు వెన్‌హాంగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. 55 ఏళ్ల వయస్సులో ఆమె తన కంటే 30 ఏళ్లు చిన్నవాడైన 25 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వివాహం కేవలం వయస్సు వ్యత్యాసం వల్లే కాకుండా ఆమె ఇచ్చిన భారీ కట్నం కారణంగా కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే యంగ్ మెర్రీ రియల్ ఇంటర్నేషనల్ గ్రూప్ వ్యవస్థాపకురాలైన యు వెన్‌హాంగ్.. తన కంపెనీలోనే మోడల్‌గా పనిచేసిన లియు యుచెన్‌ను వివాహం చేసుకున్నారు. 2025లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా, అది ప్రేమగా మారింది. డేటింగ్ సమయంలోనే లియుకు ఆమె రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చారు. 2026 మార్చిలో వీరిద్దరూ వైభవంగా వివాహం చేసుకున్నారు.

రూ. 68 కోట్ల కట్నం

సాధారణంగా పెళ్లికొడుకు తరపు వారు కట్నం తీసుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ యు వెన్‌హాంగ్ స్వయంగా తన భర్తకు సుమారు రూ. 68 కోట్లు విలువైన నగదు, ఆస్తులు మరియు విలాసవంతమైన వస్తువులను కట్నంగా ఇచ్చారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. అయితే యు వెన్‌హాంగ్‌కు ఇది ఆరో వివాహం. గతంలో ఆమె ఐదుసార్లు వివాహం చేసుకున్నారు. ఆమె చివరి సంబంధం అల్బేనియన్ మోడల్ రోలాండో లెకాజ్‌తో పదేళ్ల పాటు కొనసాగింది. ఆమెకు గత సంబంధాల ద్వారా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

పేదరికం నుండి సామ్రాజ్యం వరకు..

చైనాలోని లియావోనింగ్‌లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన యు వెన్‌హాంగ్ కథ నిజంగా ఒక సినిమాని తలపిస్తుంది. 18 ఏళ్లకే తండ్రిని కోల్పోయిన ఆమె, కుటుంబాన్ని పోషించడానికి సౌందర్య పరిశ్రమలో అడుగుపెట్టారు. చిన్న బ్యూటీ సెలూన్‌తో మొదలై.. నేడు 150కి పైగా స్టోర్లు ఉన్న అంతర్జాతీయ గ్రూప్‌గా తన వ్యాపారాన్ని విస్తరించారు. ‘‘పురుషులు నమ్మదగిన వారు కాదు, మహిళలు సంపాదించిన డబ్బు మాత్రమే వారికి రక్షణ’’ అనేది ఆమె సిద్ధాంతం.

వివాదాల పుట్ట

ఆమె విజయం వెనుక భారీ వివాదాలు కూడా ఉన్నాయి. గతంలో ఆమె సుమారు 4.7 బిలియన్ యువాన్ల ఆదాయాన్ని దాచిపెట్టి, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమె కంపెనీ ప్రవేశపెట్టిన పోర్సిలిన్ డాల్ విధానంపై వైద్యపరమైన విమర్శలు ఉన్నాయి. కాగా వయస్సుతో సంబంధం లేకుండా తనకు నచ్చినట్లు జీవిస్తూ, భారీ కట్నంతో యువకుడిని పెళ్లాడిన ఈ బిజినెస్ టైకూన్ ఉదంతం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Follow Us
సౌదీలో ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి.. 309 మందికి గాయాలు!
సౌదీలో ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి.. 309 మందికి గాయాలు!
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!
క్రోనీ కేపిటలిజం కోసం మస్క్‌ మామ దొంగాట?
క్రోనీ కేపిటలిజం కోసం మస్క్‌ మామ దొంగాట?