రూ.200 కూపన్‌కు రూ.50 లక్షల కారు గెలిచాడు.. ఈ బుడ్డోడి లక్ మామూలుగా లేదుగా!
అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు మెడాన్ష్ రైక్వార్‌కు ఇలాంటి అదృష్టమే వరించింది. కేవలం రూ.200తో కొనుగోలు చేసిన లక్కీ డ్రా కూపన్‌తో సుమారు రూ.50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారును గెలుచుకున్నాడు. దీంతో ఆ బాలుడి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

మధ్యప్రదేశ్: అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు మెడాన్ష్ రైక్వార్‌కు ఇలాంటి అదృష్టమే వరించింది. కేవలం రూ.200తో కొనుగోలు చేసిన లక్కీ డ్రా కూపన్‌తో సుమారు రూ.50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారును గెలుచుకున్నాడు. దీంతో ఆ బాలుడి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
బుర్హాన్‌పూర్‌లోని సీలంపురాకు చెందిన మెడాన్ష్‌కు ఈ అదృష్టం అతని నానమ్మ కిరణ్ రైక్వార్ ద్వారా దక్కింది. ఏడాది క్రితం అభాపురిలోని శ్రీ సర్కార్ ధామ్‌లో నిర్వహించిన గర్బా కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అక్కడ రూ.200తో లక్కీ డ్రా కూపన్ కొనుగోలు చేసి, తన మనవడి పేరును నమోదు చేశారు. అయితే, ఆ కూపన్ తమ కుటుంబ జీవితాన్నే మార్చేస్తుందని వారు ఊహించలేదు. గత రెండేళ్లుగా సొంత కారు కొనాలని ఆశపడుతున్న కుటుంబానికి, ఏకంగా టయోటా ఫార్చ్యూనర్ బహుమతిగా రావడం ఆనందాన్ని రెట్టింపు చేసింది.
2026లో లక్కీ డ్రా విజేతగా మెడాన్ష్ పేరును ప్రకటించడంతో కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. బహుమతిని స్వీకరించేందుకు బాలుడు వచ్చినప్పుడు డప్పుల మోతతో ఘన స్వాగతం పలికారు. కొత్త కారుకు సంప్రదాయ పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. బంధువులు, స్థానికులు బాలుడిని అభినందించారు.
కేవలం రూ.200 కూపన్‌తో లక్షల విలువైన కారు గెలుచుకోవడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అదృష్టం ఒక్కసారిగా జీవితంలో ఎలాంటి ఆనందాన్ని తీసుకురాగలదో చూపిస్తోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
