Trending Song : చిరంజీవి, అమల కాంబోలో సూపర్ హిట్ సాంగ్.. 36 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్..
మెగాస్టార్ చిరంజీవి, అమల కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజా విక్రమార్క’ చిత్రంలోని ఓ పాట విడుదలై దాదాపు 36 ఏళ్లు దాటినా దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఎవర్ గ్రీన్ మెలోడీ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో సంగీత ప్రియులను అలరిస్తోంది. ఇప్పుడు ఆ సాంగ్ దూసుకుపోతుంది.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మాస్ , క్లాస్ మెస్మరైజింగ్ డ్యాన్స్‌లతో టాలీవుడ్‌ను ఊపొంచిన చిత్రాల్లో ‘రాజా విక్రమార్క’ ఒకటి. 1990లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, ఇందులోని పాటలు ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి , టాలెంటెడ్ హీరోయిన్ అమల జంటగా నటించిన మ్యూజికల్ మాస్టర్‌పీస్ సాంగ్ ‘కొండ కోనా తంబూరానే ఇచ్చేనంట.. కోకిలమ్మా పేరంటానే వచ్చేనంట..’ పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాదాపు 36 ఏళ్లు గడుస్తున్నప్పటికీ, ఈ పాటకు ఉన్న క్రెయిజ్ ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో ఈ పాటకు రాజ్ కోటి అందించిన సంగీతం, ఆర్కెస్ట్రా అద్భుతంగా ఉంటాయి. ఎక్కడ చూసినా మార్మోగిన ఈ మెలోడియస్ సాంగ్, ఇప్పటికీ సోషల్ మీడియాలో , యూట్యూబ్‌లో సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ వీడియో యూట్యూబ్‌లో ఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంటూ మెగాస్టార్ రికార్డులను క్రియేట్ చేస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
సినిమాలో చిరంజీవి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్, అమల అద్భుతమైన అభినయం, వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ పాటకు ప్రాణం పోశాయి. ఎన్ని తరాలు మారినా, ఎంత కొత్త మ్యూజిక్ వచ్చినా ఇలాంటి క్లాసికల్ మెలోడీ సాంగ్స్‌కు ఉండే ప్రత్యేకత ఎప్పుడూ చెక్కుచెదరదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెగాస్టార్ అభిమానులు ఈ ఎవర్ గ్రీన్ సాంగ్‌ను ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు.
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..
ఈ సినిమాలో చిరంజీవి సరసన అమల నూతన జంటగా నటించారు. చిరంజీవి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో చిరు పోషించిన స్టైలిష్ ఏజెంట్/పోలీస్ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచింది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్, యాక్షన్ సీక్వెన్సులు అప్పట్లో చాలా కొత్తగా ఉండి టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచాయి.
ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..
కొండ కోనా సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..
