Bigg Boss 10 Telugu: వారెవ్వా.. ఓటింగ్‌లో దూసుకొచ్చిన రోహిత్, వంశీ.. మరోసారి డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఆట ప్రారంభమై ఎనిమిది వారాలు గడుస్తున్న కొద్దీ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య పోటీ మరింత తీవ్రమవుతోంది. ముఖ్యంగా ఈ ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ ఊహించని మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జడ్జీల ప్యానెల్ నిర్ణయాలు, కంటెస్టెంట్ల వ్యూహాలు హౌస్‌లో సమీకరణాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిదో వారం ఓటింగ్ ఫలితాలు , ఎలిమినేషన్ విశ్లేషణ హాట్ టాపిక్‌గా మారింది.

బిగ్ బాస్ ఎనిమిదో వారం నామినేషన్స్ మరింత హీటెక్కించిన సంగతి తెలిసిందే. గతవారం దక్షి, షాలిని డబుల్ ఎలిమినేషన్ కాగా.. ఈసారి ఓటింగ్ రిజల్ట్ లో భారీగానే డిఫరెన్స్ వచ్చింది. మొన్నటివరకు ఓటింగ్ భారీగా తగ్గిన రోహిత్.. ఇప్పుడు అనుహ్యంగా దూసుకోచ్చాడు. ఈవారం నామినేషన్స్‌లో త్రిగుణ్ మాస్టర్ మైండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాను నామినేషన్స్‌లో లేకపోయినా, తన స్నేహితుడు వంశీని వ్యూహాత్మకంగా నామినేషన్‌లో పెట్టడం ద్వారా ఓటింగ్‌లో పెద్ద గేమ్ ప్లాన్ అమలు చేశారు. ఫలితంగా తొలిరోజు ఓటింగ్‌లోనే వంశీ భారీ ఓట్లతో దూసుకుపోతూ టాప్ ప్లేస్ వైపు వచ్చేశాడు. ఇక షాలిని ఎలిమినేషన్ అనంతరం రోహిత్ ఆట తీరు మారింది. దీంతో అతడికి ఓట్లు గుద్దిపడేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో రోహిత్ సైతం తనదైన క్రేజ్‌తో ఓటింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సుధీర్, రాంప్రసాద్, రామకృష్ణ తదితరులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అయితే, గత కొన్ని వారాల లాగే ఈసారీ నటి వర్షిణి ఓటింగ్‌లో అత్యంత వెనుకబడి కేవలం 5 శాతంతో లీస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ముకేష్ ఈవారం నామినేషన్స్‌లో లేకపోవడం వల్ల ఆయన ఓట్లు వర్షిణికి ట్రాన్స్ఫర్ కాలేదని తెలుస్తోంది. ప్రతి వారం డేంజర్ జోన్‌లో ఉంటున్న వర్షిణి ఈసారి ఎలిమినేషన్ గండం నుంచి ఎలా బయటపడతారనేది ఆసక్తికరంగా మారింది. హౌస్‌లో కొనసాగడానికి ఆమె ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో వేచి చూడాలి.
రోహిత్ (29% ఓట్లు): గతంలో కొన్ని వివాదాలు, ప్రవర్తన కారణంగా గ్రాఫ్ కొంత తగ్గినప్పటికీ, అగ్నిపరీక్ష నుంచి రావడంతో పాటు ఆయనకు ఉన్న ఓటర్ బేస్ కారణంగా ఈవారం తొలిరోజు ఓటింగ్‌లో రోహిత్ దాదాపు 29 శాతం ఓట్లతో అగ్రస్థానంలో (టాప్-1) కొనసాగుతున్నారు.
వంశీ (21% ఓట్లు): త్రిగుణ్ వేసిన మాస్టర్ మైండ్ స్ట్రాటజీ కారణంగా వంశీకి ఊహించని విధంగా ఓటింగ్ భారీగా పెరిగింది. త్రిగుణ్ ఫ్యాన్స్ అంతా వంశీకి సపోర్ట్ చేస్తుండటంతో, ఈవారం తొలిరోజు ఓటింగ్‌లో దాదాపు 21 శాతం ఓట్లతో వంశీ రెండో స్థానంలో దూసుకుపోతున్నారు.
సుధీర్ (10% ఓట్లు): తనకంటూ ప్రత్యేకమైన ఆటతీరును ప్రదర్శిస్తున్న సుధీర్ 10 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
రాంప్రసాద్ (09% ఓట్లు): టాస్క్‌లలో పంచ్‌లు, తనదైన కామెడీతో అలరిస్తున్న రాంప్రసాద్‌కు 09 శాతం ఓట్లు నమోదయ్యాయి.
రామకృష్ణ (08% ఓట్లు): పోరాడుతూ ముందుకు వెళ్తున్న రామకృష్ణకు 08 శాతం ఓట్లు దక్కాయి.
ఝాన్సీ (08% ఓట్లు): హౌస్‌లో తన గొంతును గట్టిగా వినిపిస్తున్న ఝాన్సీ కూడా 08 శాతం ఓట్లతో సమానంగా కొనసాగుతున్నారు.
శివ (07% ఓట్లు): ఆటలో తనకంటూ కొన్ని వివాదాలు, హైలైట్స్ మూటగట్టుకున్న శివకు 07 శాతం ఓట్లు వచ్చాయి.
వర్షిణి (05% ఓట్లు – డేంజర్ జోన్): ప్రతివారం లాగే ఈసారీ వర్షిణి ఓటింగ్‌లో అత్యంత వెనుకబడి కేవలం 05 శాతం ఓట్లతో లీస్ట్ పొజిషన్‌లో (డేంజర్ జోన్) నిలిచింది. ముకేష్ ఈవారం నామినేషన్స్‌లో లేకపోవడం వల్ల ఆయన ఓట్లు వర్షిణికి ట్రాన్స్ఫర్ కాలేకపోవడమే ఆమె తక్కువ ఓట్లు రావడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
