ప్రకృతమ్మ తొండాట..! తెలుగు నేలపై గుండెలు మండే విచలిత దృశ్యం!
మొన్నటిదాకా నీకో ముద్ద నాకో ముద్ద టైపు. ఒకరు ఏడిస్తే మరొకరికి కన్నీళ్లొచ్చేవి. ఎంతయినా తోడబుట్టిన రాష్ట్రాలు కదా.. అందుకని. ఇప్పుడైతే విడిపోయి పుష్కరకాలమైంది. ఎవరి బాధ వాళ్లదే. ఎవరి నొప్పికి వాళ్లే బాధ్యులు. నీదీ తెలుగే, నాదీ తెలుగే అని అలయ్ బలయ్ ఆడుకునే ఛాన్సయితే లేదు. ఇద్దరి శత్రువూ ఒక్కరే అయినా విడివిడిగానే పోరాడాలి. ఇప్పుడూ అదే జరుగుతోందా? ప్రకృతమ్మ వికృతరూపం దాల్చి తెలుగునేలపై పగబట్టి చెడామడా వాయిస్తుంటే చెరోపక్క చేరి వార్ షురూ చేశాయి ఏపీ అండ్ తెలంగాణ ప్రభుత్వాలు. డబుల్ ట్రబుల్ ఇన్ టూ స్టేట్స్.. డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం..

గొట్టిపాటి రవికుమార్, భట్టి విక్రమార్క.. ఒకరు ఏపీకి. ఇంకొకరు తెలంగాణకు కరెంటు మంత్రులు. తుఫానుతో నష్టం ఎంత.. రిలీఫ్ ఆపరేషన్స్ ఎందాకా వచ్చాయని ఫోన్ చేసి గొట్టిపాటిని ఆరా తీశారు భట్టి. విపత్కర పరిస్థితుల్లో ఏపీకి తోడుగా ఉంటామని మాటిచ్చారు. విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైతే సిబ్బందిని, సామగ్రినీ పంపుతామన్నారు. భట్టి పరామర్శకు థ్యాంక్స్ కూడా చెప్పారు గొట్టిపాటి. ఈ సమయంలో కచ్చితంగా ఇదొక మంచి పరిణామమే. దాయాది రాష్ట్రాల మధ్య ఈ మాత్రం పలకరింత గొప్ప విషయమే. కాకపోతే, గొట్టిపాటి నుంచి ధన్యవాదాలైతే తీసుకున్నారు గానీ, భట్టి గారి మనసు కూడా గజిబిజిగానే ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని రౌండప్ చేసిన కరువు పరిస్థితి అక్కడి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టూ స్టేట్స్.. టూ స్టోరీస్.. రెండూ ట్రాజెడీలే! టూ స్టేట్స్.. టూ స్టోరీస్.. రెండూ ట్రాజెడీలే! ఉభయ కుశలోపరికి ఛాన్సే లేదిక్కడ. ఆల్ ఈజ్ వెల్ అనుకునే సిట్యువేషనే లేదు. ఎందుకంటే, ఏ రాష్ట్రంలో కూడా యావన్మందీ క్షేమంగా లేరు. ఎండిన నేల, మండిన గుండె. ఒకవైపు తుఫాను విలయం.. మరోవైపు కరువు రక్కసి ప్రళయం. నేచర్ అడ్డం తిరిగి రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు రకాల ట్రీట్‌మెంట్స్ ఇచ్చి చెడామడా వాయిస్తోంది. అర్నబ్ తుఫానుతో చావు తప్పినా కన్ను లొట్టబోయింది ఏపీకి. అంచనాలకు మించి జరిగిన నష్టాన్ని చూసి బావురుమంటోంది ఆంధ్రా నేల. అటు, అందరు శత్రువుల్లోకీ నువ్వే నాకు వెరీవెరీ స్పెషల్ అంటూ తెలంగాణ...
