AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 ఏళ్ల బాలుడిని బలిగొన్న ప్రహరీ గోడ.. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చిన ఆర్నబ్ తుఫాన్!

గుంటూరు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా పాత ప్రహరీ గోడ కూలి 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జరిగిన ఈ విషాద ఘటన..ఆ కుటుంబాన్ని తీరని శోకసంద్రంలో ముంచింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

11 ఏళ్ల బాలుడిని బలిగొన్న ప్రహరీ గోడ.. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చిన ఆర్నబ్ తుఫాన్!
Tragedy In Guntur
Balaraju Goud
|

Updated on: Oct 28, 2026 | 9:03 PM

Share

గుంటూరు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా పాత ప్రహరీ గోడ కూలి 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జరిగిన ఈ విషాద ఘటన..ఆ కుటుంబాన్ని తీరని శోకసంద్రంలో ముంచింది.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలి మండలం గుడివాడ గ్రామానికి చెందిన చింతలపూడి దేవాన్సు (11) వర్షాల కారణంగా ప్రమాదానికి గురయ్యాడు. ఇంటి పక్కనే ఉన్న పాత ప్రహరీ గోడ భారీ వర్షానికి ఒక్కసారిగా కూలి బాలుడిపై పడింది. దీంతో గోడ శిథిలాల కింద చిక్కుకున్న దేవాన్సు అక్కడికక్కడే మృతిచెందాడు.

రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో బాలుడు గోడ కింద చిక్కుకున్న విషయాన్ని వెంటనే ఎవరూ గుర్తించలేకపోయారు. తల్లిదండ్రులు బాలుడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వర్షం తగ్గిన తర్వాత అతడి కోసం వెతకగా, కూలిన గోడ కింద విగతజీవిగా కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

భారీ వర్షాల సమయంలో పాత ప్రహరీ గోడలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల సమీపంలో ఉండటం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకరమైన గోడలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
11 ఏళ్ల బాలుడిని బలిగొన్న ఆర్నబ్ తుఫాన్!
11 ఏళ్ల బాలుడిని బలిగొన్న ఆర్నబ్ తుఫాన్!
ఉదయాన్నే ముఖానికి ఉమ్మి రాస్తా.. పింపుల్స్ రాకుండా ఉండాలంటే ఇదే..
ఉదయాన్నే ముఖానికి ఉమ్మి రాస్తా.. పింపుల్స్ రాకుండా ఉండాలంటే ఇదే..
నువ్వు డ్రైవర్‌గా పనిచేస్తే కనీసం కడుపునిండా భోజనమైనా దొరుకుతుంది
నువ్వు డ్రైవర్‌గా పనిచేస్తే కనీసం కడుపునిండా భోజనమైనా దొరుకుతుంది
ఆ ఒక్క డైలాగ్‌తో దూకుడు పెంచిన వైభవ్.. అసలు విషయం చెప్పిన అభిషేక్
ఆ ఒక్క డైలాగ్‌తో దూకుడు పెంచిన వైభవ్.. అసలు విషయం చెప్పిన అభిషేక్
Video:సౌదీ పై బాంబు దాడులు.. హౌతీలు వీడియో విడుదల!
Video:సౌదీ పై బాంబు దాడులు.. హౌతీలు వీడియో విడుదల!
తెలంగాణలో ముందుగానే వేసవి సెలవులు రానున్నాయా?
తెలంగాణలో ముందుగానే వేసవి సెలవులు రానున్నాయా?
ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి.. పెరుగు ఎప్పుడు తినాలి..?
ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి.. పెరుగు ఎప్పుడు తినాలి..?
రాముడి పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రాముడి పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
10 నిమిషాలు బైక్‌పై కదలకుండా కూర్చొంటే.. ఫ్రీగా బైక్!
10 నిమిషాలు బైక్‌పై కదలకుండా కూర్చొంటే.. ఫ్రీగా బైక్!
ఈ పచ్చిమిర్చి చట్నీ ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
ఈ పచ్చిమిర్చి చట్నీ ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది