వరుస సినిమాలతో సంయుక్త మీనన్ దూకుడు.. 

28 October 2026

Rajeev 

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీలో సంయుక్త మీనన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా కోసం ఆమె గుర్రపు స్వారీ వంటి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్ సినిమాలో విజయ్ సేతుపతి, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంయుక్త ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది

ది బ్లాక్ గోల్డ్ సినిమాలో సంయుక్త పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. అక్రమ బొగ్గు తవ్వకాల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది.

రామ్ పోతినేని హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యిందని టాక్.  

రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న  తమిళ చిత్రం బెంజ్ లో సంయుక్త కీలక పాత్ర పోషిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌ లో భాగంగా ఈ సినిమా రూపొందుతోంది.

హిందీ చిత్రసీమలోనూ సంయుక్త తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సంయుక్త కీలక పాత్రలో నటిస్తుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న హైందవ చిత్రంలో సంయుక్త మీనన్ నటిస్తున్నారు. యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాకు కూడా మంచి బజ్ ఉంది.