AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ వెనుక అసలు కథ ఇదే.. ఈ సీక్రెట్ ఫాలో చేస్తే మీరూ ఓ కాటేరమ్మ కొడుకే..!

Abhishek Sharma Fitness Secret: న్యూజిలాండ్‌పై కేవలం 35 బంతుల్లో సెంచరీ బాదిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన పవర్ హిట్టింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ విధ్వంసక బ్యాటింగ్ వెనుక ఏళ్ల తరబడి సాగిన కఠిన శిక్షణ, ఫిట్‌నెస్, టెక్నిక్, మానసిక సాధన ఉన్నాయి. అతని ఫిట్‌నెస్ ప్రయాణంలో ఆసక్తికరమైన అంశాలివే.

Venkata Chari
|

Updated on: Oct 28, 2026 | 6:46 PM

Share
Abhishek Sharma Fitness Secret: న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. మొత్తం 38 బంతుల్లో 113 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అతను భారత్‌కు 199 పరుగుల లక్ష్యాన్ని సులభంగా చేరుకునేలా చేశాడు. వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)తో కలిసి పవర్‌ప్లేలోనే 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే ఈ పవర్ హిట్టింగ్ వెనుక కేవలం సహజ ప్రతిభ మాత్రమే లేదు. చిన్న వయసు నుంచే కఠినమైన ఫిట్‌నెస్ శిక్షణ, పరుగులు, స్విమ్మింగ్, జిమ్ వర్కౌట్స్, క్రికెట్ ప్రాక్టీస్‌తో అభిషేక్ తన శరీరాన్ని సిద్ధం చేసుకున్నాడు.

1 / 7
ఉదయం 4 గంటలకే శిక్షణ..: అభిషేక్ తండ్రి, చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. అతని రోజులు ఉదయం 4 గంటలకే మొదలయ్యేవి. జిమ్, వ్యాయామం, రన్నింగ్, స్విమ్మింగ్ పూర్తి చేసిన తర్వాత క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. ఓపెనింగ్ బ్యాటర్‌గా మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడే అభిషేక్‌కు బలం, సమన్వయం, వేగంగా కదిలే సామర్థ్యం ఎంతో కీలకం.

2 / 7
స్విమ్మింగ్, రన్నింగ్, జిమ్..: అభిషేక్ శిక్షణలో స్విమ్మింగ్, రన్నింగ్, జిమ్ వర్కౌట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పవర్ హిట్టింగ్‌కు కేవలం కండరాల బలం సరిపోదు. శరీర సమతుల్యత, కదలిక, టైమింగ్, టెక్నిక్ కూడా కీలకమే. అందుకే అతని ఫిట్‌నెస్ సాధన క్రికెట్ ప్రాక్టీస్‌తో సమాంతరంగా సాగింది.

3 / 7
గోల్ఫ్‌తో బ్యాట్ స్వింగ్ సాధన..: అభిషేక్ గోల్ఫ్‌పై కూడా ఆసక్తి చూపుతాడు. యువరాజ్ సింగ్, బ్రియాన్ లారా (Brian Lara) ప్రభావంతో గోల్ఫ్ ఆడటం బ్యాట్ స్వింగ్ మెరుగుపరుచుకోవడంలో ఉపయోగపడిందని అతని తండ్రి చెప్పాడు. బ్యాలెన్స్, టైమింగ్, శరీర కదలికలపై ఇది ప్రభావం చూపింది.

4 / 7
ధ్యానం కూడా కీలకమే..: అభిషేక్ ఫిట్‌నెస్‌లో శారీరక సాధనతో పాటు మానసిక సిద్ధతకు కూడా ప్రాధాన్యం ఉంది. న్యూజిలాండ్‌పై సెంచరీ తర్వాత అతను ధ్యాన ముద్రలో సెలబ్రేట్ చేసుకున్నాడు. గతంలోనూ ధ్యానం, మానిఫెస్టేషన్ తనకు స్థిరంగా ఉండేందుకు ఉపయోగపడుతున్నాయని అతను చెప్పాడు.

5 / 7
యువరాజ్ సింగ్ మార్గదర్శకత్వం..: మాజీ భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కూడా అభిషేక్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో లోపాలను గుర్తించడం, వాటిని సరిచేసుకోవడం, క్రమశిక్షణతో సాధన కొనసాగించడం వంటి విషయాల్లో యువరాజ్ అతనికి మార్గదర్శకత్వం ఇచ్చాడు.

6 / 7
అసలు సీక్రెట్ ఏంటి? అభిషేక్ శర్మ 35 బంతుల సెంచరీ వెనుక ఒక్క ఫిట్‌నెస్ రహస్యం లేదు. చిన్న వయసు నుంచే క్రమశిక్షణ, నిరంతర సాధన, సరైన టెక్నిక్, మానసిక సిద్ధత, శారీరక శిక్షణ కలిసే అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. అతని ప్రయాణం చెబుతున్న అసలు విషయం ఒక్కటే పవర్ హిట్టింగ్ అనేది కేవలం సహజ ప్రతిభ కాదు.. దాని వెనుక ఏళ్ల కష్టం ఉంటుంది.

7 / 7
Follow Us
ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
రాగి ముద్ద తింటే నిజంగా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?  

అభిషేక్ శర్మ ఈ సీక్రెట్ ఫాలో చేస్తే మీరూ ఓ కాటేరమ్మ కొడుకే..!

భారత్‌లో ముందుగానే రిలీజ్ కానున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే’

ఇంటి గోడలకు పగుళ్లు వస్తున్నాయా? ఏ పగులుకు ఏ మెటీరియల్‌ వాడాలి?

 లుంగీతో వచ్చి చీర కట్టుకున్న వ్యక్తులు.. టీవీ9 కెమెరాకు చిక్కిన

రజినీకాంత్ మెచ్చిన సినిమా.. అడియన్స్ హృదయాలను హత్తుకుంటున్న మూవీ.

ధ్వజో యోగం.. దీపావళికి అనుకోకుండా కోటీశ్వరులయ్యే రాశులు వీరే!

అనుకున్నది సాధిస్తారు..! కొత్త సంవత్సరం లోపే వీరికి కొత్త జీవితం

3వ వన్డేలోనూ భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్