AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: సౌదీ పై బాంబు దాడులు.. హౌతీలు వీడియో విడుదల!

సౌదీ అరేబియా, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. క్షిపణులు, డ్రోన్లతో సౌదీ భూభాగంపై దాడుల వీడియోను హౌతీలు విడుదల చేయడంతో వైరల్‌గా మారింది. సౌదీ సైనిక వాహనాలు, సైనిక స్థావరాలపై డ్రోన్లు బాంబులను జారవిడిచాయి. నజ్రాన్, జిజాన్, అసీర్ ప్రాంతాల్లో సౌదీ సైనికులే లక్ష్యంగా దాడులు జరిగాయి.

Video: సౌదీ పై బాంబు దాడులు..  హౌతీలు వీడియో విడుదల!
Houthis Release Drone Strike Footage Of Saudi Border Strikes
Sharada V
|

Updated on: Oct 28, 2026 | 8:46 PM

Share

సౌదీ అరేబియా, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. క్షిపణులు, డ్రోన్లతో సౌదీ భూభాగంపై దాడుల వీడియోను హౌతీలు విడుదల చేయడంతో వైరల్‌గా మారింది. సౌదీ సైనిక వాహనాలు, సైనిక స్థావరాలపై డ్రోన్లు బాంబులను జారవిడిచాయి. నజ్రాన్, జిజాన్, అసీర్ ప్రాంతాల్లో సౌదీ సైనికులే లక్ష్యంగా దాడులు జరిగాయి.

సౌదీ రక్షణ స్థావరాలే లక్ష్యంగా దాడులు

హౌతీలు దాడులకు తెగబడటంతో సౌదీ సరిహద్దుల్లోని సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళనలు పెరిగాయి.  సౌదీ రాజధాని రియాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖపై కూడా హౌతీలు దాడి చేసినట్లు రాయిటర్స్‌ కథనంలో తెలిపింది. దీంతో పాటు నజ్రాన్‌ విమానాశ్రయంలోని రెండు సైనిక రవాణా విమానాలు, ఖమీస్‌ ముషైత్‌లోని వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.

బాలిస్టిక్‌ క్షిపణులతోనూ దాడులు

బాబ్‌ అల్‌ మందెబ్‌ జలసంధి సమీపంలో సౌదీ సైనిక బలగాలపై బాలిస్టిక్‌ క్షిపణులు, భారీ ఆయుధాలతో దాడులు చేసారు హౌతీలు. అంతర్జాతీయ వాణిజ్యానికి బాబ్‌ అల్‌ మందెబ్‌ జలమార్గం కీలకం. హౌతీల డ్రోన్లు, క్షిపణుల దాడులు పెరిగితే ప్రాంతీయ భద్రతతో పాటు అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

హౌతీలకు సౌదీ అరేబియా రూ.వేల కోట్ల ఆఫర్‌

హౌతీ తిరుగుబాటుదారులు దాడులు ఆపితే 100 కోట్ల డాలర్లు (రూ.8,500 కోట్లకు పైగా) ఆర్థిక సాయం అందించేందుకు సౌదీ ముందుకొచ్చింది. ఇరాన్ మధ్యవర్తిత్వంతో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్ ఇరాన్‌ పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. సౌదీ రక్షణ మంత్రి సైనిక రవాణా విమానంలో ఇరాన్‌కు చేరుకున్నారని, ఆ విమానంలోనే 100 కోట్ల డాలర్ల నగదును తీసుకెళ్లినట్లు సమాచారం.

చర్చల్లో అసిమ్ మునీర్‌, టర్కీ నిఘా చీఫ్‌!

చర్చల్లో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌, టర్కీ నిఘా విభాగం అధిపతి ఇబ్రహీం కలిన్ పాల్గొన్నట్లు మీడియా కథనాలు తెలిపాయి.  మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందం కింద సభ్య దేశాలపై దాడి జరిగితే పరస్పరం సైనిక సహకారం అందించాల్సి ఉంటుంది. సౌదీకి మద్దతుగా పాకిస్థాన్‌, టర్కీ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకుండా, సైనిక సహకారానికే పరిమితమైనట్లు తెలుస్తోంది.

Follow Us