AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrithik Roshan: రామాయణం పై విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్

సినిమా ఇండస్ట్రీలో రామాయణం పై ఎన్నో సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. రామాయణ ఇతిహాసంపై వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమా తెరకెక్కితుంది. నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Hrithik Roshan: రామాయణం పై విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్
Hrithik Roshan
Rajeev Rayala
|

Updated on: Apr 05, 2026 | 11:21 AM

Share

రామాయణం నేపథ్యంలో బాలీవుడ్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రామాయణం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి నాటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు.. ముఖ్యంగా రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్నాడు. అలాగే సహనిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు యష్. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా టీజర్ లో రాముడిగా రణబీర్ కపూర్ అద్భుతంగా కనిపించాడు. అయితే ఈ టీజర్ లో వీఎఫ్ఎక్స్ గురించి రకరకాల కామెంట్స్ ఆవస్తున్నాయి.

కొంతమంది వీఎఫ్ ఎక్స్ బాగుందంటుంటే మరికొంతమంది బాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పలువురు రామాయణం  టీజర్ పై రకరకాల విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా రామాయణం పై వస్తున్న విమర్శలకు హీరో హృతిక్ రోషన్ కౌంటర్ ఇచ్చారు. హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక  పోస్ట్‌ను షేర్ చేశారు. “ఒక భారీ సినిమాను  రూపొందించే క్రమంలో నిర్మాతల ఉద్దేశం ప్రశంసించాలి. కల్కి 2898 AD, బాహుబలి, ఇప్పుడు రామాయణం వంటి సినిమాలను తీస్తున్న వారు నా దృష్టిలో అసలైన హీరోలు అని హృతిక్ రోషన్ రాసుకొచ్చాడు. అలాగే ఈ దర్శకులంతా ఎవరూ చేయని సాహసాన్ని చేస్తున్నారు” అని హృతిక్ పేర్కొన్నారు.

సినిమాలోని వీఎఫ్ఎక్స్ పై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. ” వీఎఫ్ఎక్స్ అంటే కేవలం వాస్తవానికి దగ్గరగా ఉండటమే కాదు, ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిని ఎంచుకుంటారు. కొన్నిసార్లు అది ‘స్టోరీ బుక్’ తరహాలో ఉండవచ్చు. ఎన్నో వందల మంది సినిమాల కోసం కష్టపడుతూ ఉంటారు. వారి శ్రమను తక్కువ చేసి చూడకూడదు. “ఇది నిజంగా కనిపిస్తుందా?” అని అడిగే బదులు, “ఇది ఆ కథా ప్రపంచానికి సరిపోతుందా?” అని ఆలోచించాలని అంటూ హృతిక్ రోషన్ రాసుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us