AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో కొత్త పథకం.. నేరుగా అకౌంట్లోకి రూ.10 లక్షలు.. వీరందరికీ ఛాన్స్

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్. వారికి ఇక నుంచి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఇప్పటివరకు వీధుల్లో మరణించినవారికి మాత్రమే బీమా సౌకర్యం ఉండగా.. ఇక నుంచి సహజమరణం పొందినా రూ.10 లక్షల వరకు కుటుంబానికి ఆర్ధిక సాయం అందిస్తారు.

Telangana: తెలంగాణలో కొత్త పథకం.. నేరుగా అకౌంట్లోకి రూ.10 లక్షలు.. వీరందరికీ ఛాన్స్
Money
Venkatrao Lella
|

Updated on: Apr 05, 2026 | 7:29 AM

Share

సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ప్రమాద బీమా, బోనస్ లాంటి అనేక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ క్రమంలో కార్మికుల కుటుంబాలకు ఆర్ధిక భద్రత కల్పించేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మరో నిర్ణయం తీసుకుంది. సింగరేణి కార్మికులు సహజ మరణం పొందితే కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందించనుంది. ఈ మేరకు ఉచిత బీమా పథకాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చేసింది. ప్రతీ కార్మికుడికి ఇవి వర్తించనుందని సింగరేణి వర్గాలు స్పష్టం చేశాయి.

రూ.కోటి ప్రమాద బీమా

ఇక సింగరేణి కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తూ చనిపోతే కుటుంబానికి రూ. కోటి ప్రమాద బీమా స్కీమ్‌ను ఇప్పటికే అందిస్తోంది. అయితే వీధుల్లో ఉన్నప్పుడు మరణిస్తేనే ఇది వరిస్తుంది. సహజ మరణం పొందినవారికి ఎలాంటి బీమా లేదు. అయితే ఇప్పుడు సహజ మరణం పొందినా.. కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందిస్తారు. ఈ బీమా పథకాన్ని అమలు చేసేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి కార్మికులు అనారోగ్య కారణాలతో మరణించినా లేదా ఇతర కారణాలతో మరణించినా బీమా సొమ్ము అందుతుంది. యూనియన్ బ్యాంకులో కార్పొరేట్ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చుతారు. యూనియన్ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉండాలని తెలిపింది. త్వరలో అన్ని బ్యాంకులు కూడా కార్మికులకు ఈ సౌకర్యం కల్పించనున్నాయి.

ప్రీమియం లేకుండానే..

మాములుగా జీవిత బీమా తీసుకోవాలంటే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి కార్మికులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం మొత్తాన్ని బ్యాంక్ భరించనుంది. ప్రస్తుతం కార్మికులకు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యూనియన్ బ్యాంక్ రూ.కోటి ప్రమాద బీమాను అమలు చేస్తున్నాయి. ఇందులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు రూ.10 లక్షల బీమా ప్రకటించగా.. మిగతా బ్యాంకులు కూడా అదే బాటలో నడించేందుకు సిద్దమవుతున్నాయి. దీంతో త్వరలో సిగరేణి కార్మికులందరికీ ప్రయోజనం దక్కనుంది. కాగా సింగరేణి గనుల్లో పనిచేసే కార్మికులకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ క్రమంలో హెల్త్ ఇన్యూరెన్స్ సౌకర్యం కూడా సింగరేణి సంస్థ కల్పిస్తోంది.

Follow Us
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.10 లక్షల వరకు బెనిఫిట్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.10 లక్షల వరకు బెనిఫిట్
2027 ప్రపంచకప్‌నకు తొలి ప్లేయర్ ఫిక్స్ చేసిన గంభీర్.. ఎవరంటే?
2027 ప్రపంచకప్‌నకు తొలి ప్లేయర్ ఫిక్స్ చేసిన గంభీర్.. ఎవరంటే?
వేసవి తాపాన్ని తరిమికొట్టే చిట్కాలు,ఆహార నియమాలే ఆరోగ్యానికి రక్ష
వేసవి తాపాన్ని తరిమికొట్టే చిట్కాలు,ఆహార నియమాలే ఆరోగ్యానికి రక్ష
మీ టూత్‌పేస్ట్ అసలైనదా లేక నకిలీదా.. సింపుల్‌గా ఇలా కనిపెట్టండి
మీ టూత్‌పేస్ట్ అసలైనదా లేక నకిలీదా.. సింపుల్‌గా ఇలా కనిపెట్టండి
పేదలకు రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్.. ప్రభుత్వం శుభవార్త
పేదలకు రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్.. ప్రభుత్వం శుభవార్త
మీ కొత్త ఫోన్‌లో ఈ AI ఫీచర్లు ఉండేలా చూసుకోండి!
మీ కొత్త ఫోన్‌లో ఈ AI ఫీచర్లు ఉండేలా చూసుకోండి!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులు రెండు తింటే చాలు ముసలితనం దరిచేరదు!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులు రెండు తింటే చాలు ముసలితనం దరిచేరదు!
జస్ట్‌ AIని ఉపయోగించి.. బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ
జస్ట్‌ AIని ఉపయోగించి.. బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే?
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే?
ఆ కార్డు లేకుంటే మీకు డబ్బులు రావు!
ఆ కార్డు లేకుంటే మీకు డబ్బులు రావు!