Telangana Rains: వలలు కూడా అవసరంలే.. రోడ్డుపై వెంటాడితే 10 కేజీల చేపలు దొరికాయి

తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. వర్షాల ప్రభావంతో నిర్మ‌ల్ జిల్లాలోని వాగులు, వంక‌లు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.

Telangana Rains: వలలు కూడా అవసరంలే.. రోడ్డుపై వెంటాడితే 10 కేజీల చేపలు దొరికాయి
Fish On Road
Follow us

|

Updated on: Jul 22, 2021 | 8:36 PM

తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. వర్షాల ప్రభావంతో నిర్మ‌ల్ జిల్లాలోని వాగులు, వంక‌లు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వ‌ర‌ద నీరు నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోకి చేర‌డంతో రోడ్ల‌న్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. వ‌ర‌ద నీటిలో చేప‌లు కొట్టుకురావ‌డంతో..వాటి  కోసం జ‌నం ప‌రుగులు ఎగబడ్డారు. చేప‌ల‌ను ప‌ట్టుకునేందుకు స్థానికులు పరుగులు తీశారు. వాటిని పట్టేందుకు పోటీ పడ్డారు చాలామందికి పెద్ద పెద్ద చేపలే దొరికాయి. ఎంచక్కా వాటిని ఇళ్లకు తీసుకెళ్లారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. అంతేకాదు.. పశ్చిమ కనుమల్లోని మహాబళేశ్వరంలో కుండపోత కురుస్తోంది. అక్కడ సుమారు 70 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని నార్నూలు దగ్గర ఉమ్రీ వాగు పొంగింది. ఓ యువకుడు వాగు దాటుతూ కొట్టుకుపోయాడు. ఒక్కసారిగా పెరిగిపోతున్న ప్రవాహాన్ని స్థానికులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. అటు వేములవాడ పట్టణంలో మూలవాగు పొంగింది. చేపలవేటకు వెళ్లిన 10 మంది చిక్కుకుపోయారు. దీంతో.. పోలీసుల సహాయక చర్యలు చేపట్టారు.

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బుద్దికొండలో ఓ ఆటో వరదలో కొట్టుకుపోయింది. రాజులతాండ గ్రామానికి వెళ్ళే వాగు పొంగిపొర్లడంతో ఆటో ఆ ప్రవాహ ధాటికి వాగులో కొట్టుకుపోయింది. నేరడిగొండ మండలం రాజుల్ తండాలో నిండు గర్భిణి అవస్థలు అందర్నీ కలచివేస్తున్నాయి. అసలే వాన వరద.. ఆపై పురిటినొప్పులు.. చేసేదిలేక ఎడ్లబండిపైనే ఆస్పత్రికి బయలెళ్లారు. ఓ వైపు వాన.. మరోవైపు గతుకుల రోడ్డు.. అటూ ఇటూ కదులుతూ అతికష్టం మీద ఎడ్లబండి ప్రయాణం కొనసాగింది. ఇన్ని ఇబ్బందుల మధ్య గర్భిణి నరకయాతన అనుభవించింది.

Also Read: తాగిన మైకంలో పొంగిపొర్లుతున్న వాగు మధ్యలో డ్యాన్స్… చివరికి ఏం జరిగిందో మీరే చూడండి

కర్నూలు జిల్లాలో పాల వ్యాను బోల్తా.. జనాలు చూడండి ఎలా ఎగబడి వచ్చారో