Telangana: రేపు మరోసారి భేటీ కానున్న తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల్లో టిక్కెట్ల టెన్షన్‌

వార్ రూమ్‌లో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సభ్యులు చర్చించిచారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ లో ఉండడంతో రేపు మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సందర్భంగా సీఎల్పీనేత భట్టి విక్రమార్క, మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల

Telangana: రేపు మరోసారి భేటీ కానున్న తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల్లో టిక్కెట్ల టెన్షన్‌
Bhatti Vikramarka
Follow us
Basha Shek

|

Updated on: Sep 20, 2023 | 10:14 PM

వార్ రూమ్‌లో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సభ్యులు చర్చించిచారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ లో ఉండడంతో రేపు మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సందర్భంగా సీఎల్పీనేత భట్టి విక్రమార్క, మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘స్క్రీనింగ్ కమిటీ సమావేశం మధ్యలో ఆగింది. అభ్యర్థుల ఎంపికపై చాలా వరకు చర్చ జరిగింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చ సందర్భంగా సభ్యులుగా ఉన్న ఎంపీలు వెళ్లాల్సి వచ్చింది.అందువల్ల చర్చ మధ్యలో ఆగింది… రేపు తదుపరి చర్చ కొనసాగుతుంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఎంపీగా ఉన్నారు.. ఆయన లోకసభలో ఓటింగ్ కి హాజరు కావాల్సి ఉంది. రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. పార్లమెంట్ కార్యకలాపాలకు అనుగుణంగా రేపు భేటీ ఉంటుంది. చాలా వేగంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు చేస్తోంది. ఉత్తర తెలంగాణ నుంచి రాష్ట్రమంతా సీనియర్ నేతల బస్సు యాత్ర చేయబోతున్నాం. అదే సమయంలో హైదరాబాదులో పార్టీ తరఫున వివిధ రకాల కార్యక్రమాలు చేపడతాం. తేదీలన్నీ త్వరలో ఖరారు అవుతాయి. పార్టీ సీనియర్ నేతలు మధు యాష్కి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు కూడా స్క్రీనింగ్ కమిటీలో ఉంటున్నారు’ అని భట్టి చెప్పుకొచ్చారు.

‘టికెట్లు రాని వారికి.. ఆ తరవాత ఏదో విధంగా వారికి న్యాయం చేసే విధంగా చూస్తాం. పార్టీలో చేరిన వారంతా ఎలాంటి షరతులు లేకుండానే చేరారు ఇక్కడ గెలుపే ప్రధానమైనటువంటి అంశం… దానిలో కూడా అన్ని సామాజిక సమీకరణాలను క్రోడీకరించి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దూరమైన వర్గాలను కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేయడమే ప్రథమ ప్రాధాన్యం. కాంగ్రెస్ పార్టీని అనాదిగా నమ్ముకుంటూ వస్తున్న వారిలో గెలిచేవారు ఎవరిని పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. పోటీ చేస్తాం అన్న వారందరికీ టిక్కెట్లు ఇవ్వలేము. అలా అని నిరుత్సాహపడే వారికి సముచిత న్యాయం చేస్తాము పార్టీ ఎవరినీ వదులుకోదు. అందర్నీ గుండెల్లో పెట్టుకొని కాపాడుతుంది. వామపక్షాలతో జాతీయస్థాయి నేతలు చర్చలు జరుపుతారు. వారితో వచ్చే అవగాహన మేరకే పార్టీ హై కమాండ్ ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం’ అని కాంగ్రెస్ అగ్రనేతలు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తాం..