Hyderabad: 6 రోజులు 100 సీసీ కెమెరాలు.. హృదయాలను తడిపేసిన బాలుడి కిడ్నాప్ కథ..

Hyderabad News: హైదరాబాద్‌లో ఓ బాలుడు కిడ్నాప్ ఘటన అందరి హృదయాలను కలిచివేస్తుంది. నిలోఫర్ హాస్పిటల్‌లో జరిగిన ఆరు నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. ఈ ఘటనలో మాతృత్వంలో తడిసిన ఇద్దరు తల్లుల మానసిక వ్యధ కళ్లకు కట్టినట్టు కనిపించింది. తను కుమారుడిని ఎవరో అపహరించిన బాధతో ఒక తల్లి రోధిస్తుంటే.. తన ఇద్దరు కుమారులు చనిపోయి మూడో కుమారుడు కూడా బ్రతకడు అని డాక్టర్ చెబితే మనోధైర్యం కోల్పోయిన మరో తల్లి తన విధిరాతను ప్రశ్నిస్తుంది.

Hyderabad: 6 రోజులు 100 సీసీ కెమెరాలు.. హృదయాలను తడిపేసిన బాలుడి కిడ్నాప్ కథ..
Hyderabad Kidnap Case
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Shiva Prajapati

Updated on: Sep 20, 2023 | 8:51 PM

Hyderabad News: హైదరాబాద్‌లో ఓ బాలుడు కిడ్నాప్ ఘటన అందరి హృదయాలను కలిచివేస్తుంది. నిలోఫర్ హాస్పిటల్‌లో జరిగిన ఆరు నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. ఈ ఘటనలో మాతృత్వంలో తడిసిన ఇద్దరు తల్లుల మానసిక వ్యధ కళ్లకు కట్టినట్టు కనిపించింది. తను కుమారుడిని ఎవరో అపహరించిన బాధతో ఒక తల్లి రోధిస్తుంటే.. తన ఇద్దరు కుమారులు చనిపోయి మూడో కుమారుడు కూడా బ్రతకడు అని డాక్టర్ చెబితే మనోధైర్యం కోల్పోయిన మరో తల్లి తన విధిరాతను ప్రశ్నిస్తుంది.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి వస్తుంటారు. అలాంటి నీలోఫర్ హాస్పిటల్లో సరైన భద్రత కరువైంది. ఫలితంగా ప్రతీసారి చిన్నారులు అపహరణకు గురవుతున్నారు. తాజాగా సెప్టెంబర్ 14న నీలోఫర్ హాస్పిటల్‌లో ఆరు నెలల పైసల్ అనే బాలుడు అపహరణకు గురయ్యాడు. దాదాపు ఆరు రోజుల తర్వాత వందలాది సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితులను బాన్సువాడలో పట్టుకున్నారు.

ఈ కేసులో ఇరువైపులా తల్లులు తీవ్ర క్షోభను అనుభవించారు. సెప్టెంబర్ 14న తన మరో కుమారుడి చికిత్స కోసం చిన్న కుమారుడు పైసల్‌ను తీసుకొని నీలోఫర్ హాస్పిటల్‌కు వచ్చింది ఫరీదా బేగం. అదే సమయంలో హాస్పిటల్ కి వచ్చింది మమత. తన మూడో కుమారుడు అనారోగ్యం కారణంగా చికిత్స కోసం నీలోఫర్ హాస్పిటల్‌కి వచ్చింది. ఇప్పటికే మమతకు ఇద్దరు కుమారులు జన్మించగా అనారోగ్య కారణాల దృశ్య ఇద్దరూ చనిపోయారు. అయితే మమత ఆమె భర్త శ్రీనివాస్ ఇద్దరికీ లోపం ఉన్న కారణంగా జెనటిక్ సమస్యతో మగపిల్లాడు పుడితే కచ్చితంగా చనిపోతారని వైద్యులు నిర్ధారించారు. దురదృష్టవశాత్తు మమతకు మొదటి సంతానంలో అబ్బాయి పుట్టి ఆరు సంవత్సరాల వయసులో చనిపోయాడు. రెండవ సంతానంలో కూడా అబ్బాయి పుట్టి రెండు నెలలు కూడా జీవించకుండానే మరణించాడు. ఇక తాజాగా 15 రోజుల క్రితం మరోసారి మమత మగ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టినప్పటి నుండి శిశువుకు ముక్కులో నుండి రక్తస్రావం అవుతుంది. దీంతో చికిత్స కోసం నీలోఫర్ హాస్పిటల్ కు వచ్చింది. వైద్యులు పరిశీలించి ఈ కుమారుడు సైతం బ్రతకడు అని చెప్పేశారు. దీంతో తీవ్ర మనోవేదనతో ఉన్న మమత దగ్గరికి ఫరీదా బేగం వచ్చి తన కుమారుడిని కాసేపు చూసుకోవాల్సిందిగా పైసల్ ను వదిలిపెట్టి వెళ్ళింది. అప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న మమత తమకు మగ శిశువు బ్రతకడు అనే ఆలోచనలో ఒక్కసారిగా ఆరు నెలల మగపిల్లాడు కనిపించడంతో, ఆ శిశువును అపహరించింది.

నీలోఫర్ హాస్పిటల్ నుండి ఆటోలో నేరుగా రాణిగంజ్ మీద జూబ్లీ బస్టాండ్ కు వెళ్ళింది. జూబ్లీ బస్టాండ్ నుండి బాన్సువాడ వెళ్లే బస్సు ఎక్కింది. అప్పటికే తన భర్త శ్రీనివాస్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఈ లోగా నీలోఫర్లో తమ కుమారుడు కనిపించడం లేదని ఫరీదా బేగం నాంపల్లిలో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. నిలోఫర్ హాస్పిటల్ లోపల సీసీ కెమెరాలు పనిచేయకపోవడం గమనార్హం. నిలోఫర్ హాస్పిటల్ బయట నుండి బాన్సువాడలో బస్సు దిగే వరకు పోలీసులు సుమారు వందకు పైగా సిసి కెమెరాలను విశ్లేషించారు. బాన్సువాడలో ఒక ఎకరా పొలం వీరి పేరు మీద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కామారెడ్డిలో కూరగాయలు పండిస్తూ బాన్సువాడలో ఒక ఇంటిని అద్దెకి తీసుకొని మమత దంపతులు నివసిస్తున్నారు. అక్కడికి వెళ్లిన పోలీసులు దంపతులతో పాటు ఆరు నెలల బాలుడు పైసల్ ను తమ అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు.

ఇద్దరు దంపతులకు రక్తహీనత జబ్బు, జెనెటిక్ సమస్య..

మమతను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పోలీసులు సైతం ఆమె వ్యధను అర్థం చేసుకొని కరిగిపోయిన పరిస్థితి కనిపించింది. తమకి మగసంతానం కలిగినా బ్రతకరని వైద్యులు చెప్పటంతో ఏం చేయాలో తెలీక ఈ బాలుడిని అపహరించినట్టు పోలీసుల విచారణలో మమత ఒప్పుకుంది. వీరీద్దరికీ హైపర్ విస్కాసిటీ సిండ్రోమ్ అని వ్యాధి సోకింది. ఈ వ్యాధి ద్వారా వీరికి మగ సంతానం కలిగితే కచ్చితంగా మరణిస్తారని వైద్యులు వీరికి స్పష్టం చేశారు. అయినా సరే వీరికి మూడుసార్లు మగ సంతానమే పుట్టడం, అందులో ఇద్దరు మరణించారు. తాజాగా మూడవ సంతానం నీలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ తరుణంలో మమతను అరెస్టు చేయడం పోలీసులకు సౌమ్యంగా అనిపించలేదు. ఒకవేళ వీరిని అరెస్ట్ చేస్తే నిలోఫర్‌లో ఉన్న కుమారుడుని చూసుకునేందుకు ఎవరూ ఉండరనే ఉద్దేశంతో.. సానుభూతి కోణంలో పోలీసులు వీరిని తమ నిఘా నీడలోనే నీలోఫర్ హాస్పిటల్ కు తరలించారు. తదుపరి ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంపై సెకండ్ ఒపీనియన్ తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..