తెలంగాణలో రెమ్ డెసివర్ ఇంజక్షన్ కోసం ప్రజలు అల్లాడుతున్నారు : కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్
Dasoju Sravan : రెమ్ డెసివర్ ఇంజక్షన్ కోసం ప్రజలు అల్లాడుతున్నారు.. కరోనా విజృభిస్తోంటే సీఎం కేసీఆర్ ఒక్క రివ్యూ అయిన చేశారా అంటూ నిలదీశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్...
Dasoju Sravan : రెమ్ డెసివర్ ఇంజక్షన్ కోసం ప్రజలు అల్లాడుతున్నారు.. కరోనా విజృభిస్తోంటే సీఎం కేసీఆర్ ఒక్క రివ్యూ అయిన చేశారా అంటూ నిలదీశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్. మంత్రి ఈటెల రాజేందర్ కు పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. “ఈ రోజు కరోనా పేషెంట్ లకు బెడ్లు దొరకక అల్లాడుతున్నారు.. ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. 104 కు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్.. ఇంత నిర్లక్ష్యమా..” అంటూ దాసోజు విమర్శించారు. ప్రభుత్వ హాస్పిటల్ లలో ఎంత మంది డాక్టర్లు, నర్సులను రిక్రూట్ చేశావంటే సమాధానం లేదు.. ఎంత సేపు సీఎం కేసీఆర్ కు ఎన్నికల మీద ధ్యాసే తప్ప.. ప్రజల ఆరోగ్యం మీద లేదు. బస్తీ దవాఖానలను కోవిడ్ టెస్ట్, టీకా కేంద్రాలు గా మార్చాలని సూచించినా స్పందించడం లేదు.” అని శ్రావణ్ ఆరోపించారు. “హైదరాబాద్ లో టీకా తయారవుతుంది.. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రెండు రోజులు నిలిపేశారు. కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చుతామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ పని ఎందుకు చేయడం లేదు.” అంటూ నిప్పులు చెరిగారు దాసోజు.
Read also : NASA’s Ingenuity : మరో గ్రహం మీద ఎగిరిన తొలి హెలికాప్టర్‌గా అమెరికా (నాసా) రూపొందించిన ఇన్‌జెన్యూటీ రికార్డు