Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: తెలంగాణలో మూడవ సర్కార్‌.. రెండో ముఖ్యమంత్రిగా ఏ.రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో ప్రకటన వచ్చేసింది. హైకమాండ్‌ నుంచి రేవంత్‌కు పిలుపు రావడం ఎల్లా హోటల్‌ నుంచి ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అప్పటికే ప్రోటకాల్‌ అధికారులు ఆయనకు కాన్వాయ్‌ ఏర్పాటు చేశారు. కానీ రేవంత్‌ సాదాసీదాగా ప్రయివేట్‌ వెహికల్‌లోనే ప్రయాణించారు.

Revanth Reddy: తెలంగాణలో మూడవ సర్కార్‌.. రెండో ముఖ్యమంత్రిగా ఏ.రేవంత్ రెడ్డి
Revanth Reddy Rahul Gandhi
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 06, 2023 | 10:37 AM

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో ప్రకటన వచ్చేసింది. హైకమాండ్‌ నుంచి రేవంత్‌కు పిలుపు రావడం ఎల్లా హోటల్‌ నుంచి ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అప్పటికే ప్రోటకాల్‌ అధికారులు ఆయనకు కాన్వాయ్‌ ఏర్పాటు చేశారు. కానీ రేవంత్‌ సాదాసీదాగా ప్రయివేట్‌ వెహికల్‌లోనే ప్రయాణించారు. రాత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. బుధవారం మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహు గాంధీని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే కేబినెట్‌ కూర్పుపై హైకమాండ్‌ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు రేవంత్‌ రెడ్డి.

కొత్త ముఖ్యమంత్రి అనుమల రేవంత్‌ రెడ్డి ఫ్రమ్‌ కొడంగల్‌. ప్రమాణస్వీకారం డిసెంబర్ 7 గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లో. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి ఫుల్‌ క్లారిటీతో ప్రకటన వచ్చేసింది. అయితే అంత ఆషామాషీ కాదు. గచ్చిబౌలి ఎల్లా హోటల్‌ ఏకవాక్య తీర్మానం మొదలు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ ప్రకటన వరకు.. క్షణక్షణం ఉత్కంఠ. ఎన్నో ట్విస్టులు. చర్చోపచర్చలు. సీరియల్‌ను తలపించాయి. సీఎం ఛాన్స్‌ ఎవరికి? రేసులో రేవంత్‌తో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, జానారెడ్డి..శ్రీధర్‌బాబు పేర్లు తెరపైకి వచ్చాయి. హైకమాండ్‌ పిలుపుతో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు ఢిల్లీకి వెళ్లారు. రేవంత్‌ ఎల్లా హోటల్‌లోనే ఉండిపోయారు. అటు ఢిల్లీలో హైకమాండ్‌తో ఉత్తమ్‌, భట్టి తమ మనసులో మాట చెప్పారు.

రెండు సార్లు పీసీసీ ప్రెసిడెంట్‌గా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన తాను సీఎం పదవి ఆశిస్తున్నట్టు కుండబద్దలు కొట్టారు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. సీఎల్పీ లీడర్‌గా కాంగ్రెస్‌ వాయిస్‌ను విన్పించడం సహా పాదయాత్రతో పార్టీని బలోపేతం చేసిన విషయాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారు భట్టి విక్రమార్క. దళిత సీఎంగా భట్టికి చాన్స్‌ ఇస్తారు అనే చర్చ జరిగింది. తాను కూడా సీఎం రేసులో ఉన్నానని సంకేతాలిచ్చారు శ్రీధర్‌ బాబు. అంతేకాదు గెలిచిన 65 మంది కూడా రేసులో ఉన్నవారే..! ఎవరి మాట ఎలా వున్నా హైకమాండ్‌ ఆదేశమే తమ బాట అన్నారంతా. నలుగురు ఐదుగురు సీఎం పదవిని ఆశించడంలో తప్పేముందన్నారు ఉత్తమ్‌ కుమార్‌.

మొత్తానికి ఎల్లా హోటల్‌ నుంచి ఢిల్లీకి మారిన చర్చోపచర్చల ఘట్టానికి ఎండ్‌ కార్డ్‌ వేసింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. ఫైనల్‌గా రేవంత్‌ రెడ్డిని సీఎల్పీ లీడర్‌గా డిక్లేర్‌ చేసింది. ఉత్తమ్‌, భట్టి సమక్షంలోనే కేసీ వేణుగోపాల్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. వన్‌ టూ వన్‌ అందరి అభిప్రాయాలను వినడంతో పాటు సీఎం పదవిని ఆశించిన వాళ్లకు సంతృప్తి కలిగేలా హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పాత కొత్త కాదు.. అంతా ఒకే తాటిపై వెళ్లేలా కమాండ్‌ కంట్రోల్‌ వుంటుందనే భరోసాతో పాటు ప్రాధాన్యతకు తగినట్టుగా పదవులు ఉంటాయనే హామీతో ఎట్టకేలకు ఏకాభిప్రాయం కుదిరిందనేది టాక్‌. వన్‌మ్యాన్‌ షో ఉండదు కాక ఉండదు అంటూ కేసీ వేణుగోపాల్‌ క్రిస్టల్‌ క్లియర్‌గా చెప్పడమే అందుకు నిదర్శనం

ఎల్లా హోటల్‌లో జరగనిది ఏంటీ? ఢిల్లీలో కుదిరింది ఏంటి? రెండో చోట్ల ఏకవాక్యాలే. కానీ వాటి వెనుక నిరీక్షణ ఉంది. కాంగ్రెస్‌ అంటే కలహాలు మాత్రమే కాదు. కంట్రోల్‌ కమాండ్‌ మార్క్‌ కూడా. ప్రతీ ల్యాగ్‌ వెనక ఓ లాజిక్‌ వుంటుంది. టఫ్‌ టైమ్స్‌ను హ్యాండిల్‌ చేయడంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ దిట్ట అనేది మరోసారి రుజువైంది. అంతర్గత ప్రజాస్వామ్యానికి ఎంత ప్రాధాన్యం వున్నా చివరాఖరకు హైకమాండే ఫైనల్‌. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క్, జానారెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో దిగ్గజాల బలగం అందరికీ తెలిసిందే. అయితే రేవంత్‌ రెడ్డికి మాత్రం హైకమాండే బలం.. బలగం.. సోనియా, రాహుల్‌ గాంధీ ప్రొత్సహం వల్లే తాను నిటారుగా నిలబడి పోరాడానని రేవంత్‌ పదే పదే ప్రస్తావించారు. ఆ అండనే ఇప్పుడు రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి దండను వేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…