Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident: పాతబస్తీలో కలకలం.. ఎంఐఎం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగుడు

హైదరాబాద్ పాతబస్తీలో AIMIM కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పటించాడు. న్యూ ఇందిరానగర్‌లోని హాశమాబాద్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి బాటిల్‌లో పెట్రోల్ పోసి, నిప్పంటించాడు దుండగుడు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Fire Accident: పాతబస్తీలో కలకలం.. ఎంఐఎం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగుడు
Mim Office Fire Accident
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Ravi Kiran

Updated on: Dec 06, 2023 | 3:17 PM

హైదరాబాద్ పాతబస్తీలో AIMIM కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పటించాడు. న్యూ ఇందిరానగర్‌లోని హాశమాబాద్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి బాటిల్‌లో పెట్రోల్ తీసుకుచ్చి తలుపుపై పోశాడు. అనంతరం అటు ఇటు చూసి ఒక్కసారిగా అగ్గిపుల్లతో నిప్పంటించి పరారయ్యాడు. ఎగిసి పడుతున్న మంటలను గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

12 సంవత్సరాల క్రితం ఎంఐఎం పార్టీ కార్యాలయాన్ని తెరిచారు. మంగళవారం తెల్లవారుజామున ఉన్నట్టుండి మజ్లిస్​ కార్యాలయంలో మంటలు చెలరేగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఈసారి తొమ్మిది స్థానాల నుంచి పోటీచేసిన ఆ పార్టీ.. ఏడు స్థానాల్లోనే విజయం సాధించింది. చార్మినార్‌, యాకుత్‌పుర, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర, మలక్‌పేట, కార్వాన్‌, నాంపల్లిలో గెలుపొందగా.. రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానాల్లో ఓటమి పాలైంది. ఈ సారి ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులతో తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…