KCR Birthday: జనహృదయ నేతకు నీరాజనం.. ఘనంగా కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్

KCR బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసింది TRS. టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఏర్పాటుచేసిన బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌లో గులాబీ శ్రేణులు రక్తదానం చేశాయి.

KCR Birthday: జనహృదయ నేతకు నీరాజనం.. ఘనంగా కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్
Telangana CM KCR
Follow us

|

Updated on: Feb 17, 2023 | 10:03 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ జన హృదయ నేత కేసీఆర్‌ 69 వ జన్మదినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అభిమానులు. దేశ్‌కీ నేత కేసీఆర్‌…చారిత్రక ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు…తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ పై వినూత్న రీతిలో పారా గ్లయిడర్ పై గగన వీధుల గుండా హ్యాపీ బర్త్ డే సీఎం, అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో శుబాకాంక్షలు తెలిపారు బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు అరవింద్ అలిశెట్టి.

కేసీఆర్‌ బర్త్‌డే సందర్భంగా బాణా సంచాతో ఓరుగల్లు దద్దరిల్లింది. కేసీఆర్‌ 69వ జన్మదినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, తూర్పు ఎమ్మెల్యే నరేందర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అజాంజాహి మిల్లు గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సెట్టింగ్ తో వినూత్న రీతిలో కేసీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు మంత్రులు. తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా నాలుగు రోజుల పాటు జన్మదిన సంబరాలు ఏర్పాటు చేశారు.

కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా గజ్వేల్‌లో ఐదు రోజుల పాటు శ్రమించి 18 అడుగుల భారీ చిత్రాన్ని ఆవాలతో రూపొందించి ఆకట్టుకున్నారు రామకోటి. తన అభిమాన నాయకుడు కేసీఆర్‌కి మదినిండా అభినందనలు తెలుపుకున్నాడు. అమెరికాలో స్కైడైవర్‌ సంతోష్‌ కేసీఆర్‌పై ఇలా గగన వీధుల గుండా తన అభిమానాన్ని చాటుకున్నారు. పారాచూట్‌ సాయంతో గాలిలో తేలియాడుతూ బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. బ్రెయిలీ లిపిలో రాసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షిప్త జీవిత చరిత్రను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్‌. ప్రపంచంలో ఎవరి చరిత్రా బ్రెయిలీ లిపిలో లేదన్నారు. కేసీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?