CM KCR: సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఆ రైతు కుటుంబాలకు రూ.3 లక్షల సాయం..

Telangana CM KCR: వరి కొనుగోలు విషయంపై ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఈ తరుణంలో

CM KCR: సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఆ రైతు కుటుంబాలకు రూ.3 లక్షల సాయం..
Cm Kcr
Follow us

|

Updated on: Nov 20, 2021 | 7:28 PM

Telangana CM KCR: వరి కొనుగోలు విషయంపై ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఈ తరుణంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చించేందుకు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఢిల్లీలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. రైతుల పోరాటంతోనే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దయ్యాయని కేసీఆర్ తెలిపారు. అయితే.. చట్టాలు రద్దు చేసినట్లుగానే.. రైతులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ నుంచి రూ.3 లక్షల పరిహారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

రైతు పోరాటంలో మరణించిన 750 రైతుల కుటుంబాలకు సాయం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే పేర్లు ఇవ్వాలని రైతు సంఘం నాయకులకు సూచించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. సారీ చెప్పి చేతులు దులుపుకోవడం కాదని.. ప్రతి కుటుంబానికి కేంద్రం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని.. కేసీఆర్ ప్రధాని మోదీకి సూచించారు. వ్యవసాయ రంగంలో కూడా ఆత్మనిర్భర్ అమలు చేయాలని సూచించారు. కాగా.. విద్యత్ చట్టాన్ని రద్దు చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి డిమాండ్ చేశారు. సెక్షన్ 3 కింద గోదావరి, క‌ృష్ణా నది నీటి పంపకాలపై ట్రిబ్యూనల్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో నీటి పంపకాలను తేల్చాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, జల్ శక్తి మంత్రిని కలవనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

నీటిపంపకాల విషయంలో సుప్రీంకోర్టులో వేసిన కేసును కూడా విత్‌డ్రా చేసుకున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. రాబోయే జనగణలో కులగణన చేపట్టాలని సూచించారు. బీసీ జనాభా కులగణన చేయాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. అనురాధకార్తె వచ్చిన నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని సూచించారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలని కేసీఆర్‌ కేంద్రానికి సూచించారు. ఢిల్లీ పర్యటనలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన వైఖరి తేల్చుకొని వస్తామని తెలిపారు. యాసంగిలో ఏయే పంటలు పండించాలనేది ఢిల్లీ పర్యటన అనంతరం తెలుస్తామని తెలిపారు.

సీఎం కేసీఆర్ మీడియా సమావేశాన్ని పూర్తిగా ఇక్కడ వీక్షించండి..

Also Read:

Chandrababu Naidu: త్వరలోనే పర్యటిస్తా.. వరద బాధితులకు అండగా నిలవండి: టీడీపీ అధినేత చంద్రబాబు

Latest Articles