Happy Birthday CM KCR: నేడు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు.. ఆవాలతో అభిమాని 18 అడుగుల చిత్రం

గజ్వేల్ పట్టణంలో ప్రగతి సెంట్రల్ స్కూల్ లో ఏకంగా 5రోజులు శ్రమించి కేసీఆర్ 18 అడుగుల అతి భారీ చిత్రాన్ని 25కిలోల ఆవాలను అత్యంత అద్భుతంగా చిత్రించి ఆవిష్కరించాడు వీరాభిమాని.

Happy Birthday CM KCR: నేడు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు.. ఆవాలతో అభిమాని 18 అడుగుల చిత్రం
Happy Birthday Cm Kcr
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2023 | 6:45 AM

తెలంగాణ చరిత్రను తిరగరాసిన విజేత సీఎం కేసీఆర్ పై వినూత్నంగా కొండంత అభిమానం చాటాడో వీరాభిమాని. సీఎం  69వ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో 18అడుగుల కేసీఆర్ భారీ చిత్రాన్ని 25కిలోల ఆవాలతో అద్భుతంగా చిత్రించాడు అభిమాని రామకోటి రామరాజు. గజ్వేల్ పట్టణంలో ప్రగతి సెంట్రల్ స్కూల్ లో ఏకంగా 5రోజులు శ్రమించి కేసీఆర్ 18 అడుగుల అతి భారీ చిత్రాన్ని 25కిలోల ఆవాలను అత్యంత అద్భుతంగా చిత్రించి ఆవిష్కరించాడు. కేసీఆర్ చిత్రాన్ని ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆలోచనతో చిత్రిస్తానన్నాడు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు.

గత 5సార్లు చిత్రించానని, వరి ధాన్యంతో ఒకసారి, బియ్యంతో ఒకసారి, సబ్బుబిళ్ల మీద, సునేరుతో ఒకసారి, 100కిలోల పసుపు బియ్యంతో ఒకసారి చిత్రించానని చెప్పారు. ఈసారి అవాలతో రూపొందించిన కేసీఆర్ అభిమానులు తిలకించి మంత్రముగ్దులయ్యారని తెలిపారు. అభిమానుల సందర్శనార్థం మూడు రోజులపాటు ప్రగతి స్కూల్ లో ఉంచుతానని తెలిపారు రామకోటి రామరాజు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..