ప్రారంభమైన తెలంగాణ శాసనసభ, శాసన మండలి.. ఈరోజు సభలో పలువురి సంతాప తీర్మానాలతో సరి..
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ సభలో కేవలం సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గం దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, దివంగత మాజీ ఎమ్మెల్యేలు గుండా మల్లేశ్, నాయిని నర్సింహారెడ్డి, కట్టా వెంకటనర్సయ్య, కమతం రాంరెడ్డి, కె.మధుసూధన్‌రావు, దుగ్యాల శ్రీనివాసరావు, చెంగల్ బాగన్న, కె.వీరారెడ్డిల మరణానికి సంతాపం తెలుపుతూ సభ్యులు మాట్లాడతారు. అనంతరం సభ వాయిదా పడనుంది.
రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ చేపట్టనున్నారు. 18న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలను కుదించాలని శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు సమావేశాలు ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈ నెల 18న సభలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని, 20 నుంచి 25 వరకు బడ్జెట్‌పై సాధారణ చర్చ, పద్దులపై చర్చ పూర్తిచేసి 26న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాలన్న నిర్ణయం జరిగింది. మధ్యలో సెలవు దినాలు పోగా.. మొత్తం పది రోజులపాటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
ప్రభుత్వం 18న ఉదయం 11.30 గంటలకు 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. 19వ తేదీ విరామం ఇచ్చి.. 20 నుంచి బడ్జెట్‌పై సాధారణ చర్చను చేపడతారు. 21న ఆదివారం విరామం ఇవ్వనున్నారు. 22న బడ్జెట్‌పై సాధారణ చర్చ, ఆర్థిక మంత్రి సమాధానం ఉంటుంది. 23న వివిధ శాఖల పద్దులపై చర్చ ప్రారంభమై.. 25న ముగియనుంది. 26న ద్రవ్యవినిమయ బిల్లులను ఆమోదించి సభను నిరవధికంగా వాయిదా వేస్తారు.
Read More:
ప్రైవేటు క్లినిక్‌లు నడుపుకుంటూ తమాషాలు చేస్తున్నారా..? వైద్యులపై మంత్రి చెడుగుడు.. డాక్టర్ల గుస్సా