AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: ‘చెప్పులు’ ఇవ్వడంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌.. బండి సంజయ్‌ రియాక్షన్‌ ఇదే..

ఈ ఘటనను తీవ్ర ఖండించారు బండి సంజయ్‌. అమిత్‌ షా పాదరక్షలు మోసారని వెల్లువెత్తుతున్న విమర్శలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు.

Bandi Sanjay: ‘చెప్పులు’ ఇవ్వడంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌.. బండి సంజయ్‌ రియాక్షన్‌ ఇదే..
Bandi Sanjay
Sanjay Kasula
|

Updated on: Aug 22, 2022 | 7:44 PM

Share

తెలంగాణలో చెప్పుల ఇష్యూ పొలిటికల్‌ హీట్‌ పుట్టిస్తోంది. అమిత్ షాకు బండిసంజయ్‌ చెప్పులు ఇవ్వడాన్ని రాజకీయపార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. బీజేపీలో బానిసత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. అయితే ఈ ఘటనను తీవ్ర ఖండించారు బండి సంజయ్‌. అమిత్‌ షా పాదరక్షలు మోసారని వెల్లువెత్తుతున్న విమర్శలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రణబ్‌, నరసింహన్‌కు కాళ్లు మొక్కిన కేసీఆర్‌.. కోవింద్‌కు ఎందుకు మొక్కలేదు అంటూ దుయ్యబట్టారు. మేం పాదరక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తామని అన్నారు. మేం గులామ్‌లు కాదు.. మజ్లిస్‌కు సలాం కొట్టే వారసులు అసలే కాదు. అవసరం తీరాక పాదాలు పట్టి లాగే అలవాటు మాకు లేదంటూ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ లిక్కర్‌ మాఫియాలో పడికొట్టుకుంటున్న కుటుంబసభ్యులను కాపాడుకునేందుకు TRS నేతలు చేస్తున్న డైవెర్షన్ పాలిటిక్స్‌ ఇవి అని సంజయ్‌ ట్వీట్‌ చేశారు. అమిత్‌ షా తమకు ఆదర్శనేత అని.. చెప్పులు అందిస్తే పెద్ద ఇష్యూ ఏం కాదన్నారు బండి.

అమిత్‌ షాకు చెప్పులు అందిస్తే పెద్ద ఇష్యూనా.. అని మండిపడ్డారు బండి సంజయ్‌. అమిత్‌ షా మాకు ఆదర్శనాయకుడన్నారు. ఐఏఎస్‌లు మీకు గులాంగీరీ చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. లిక్కర్‌ ఆరోపణలను తప్పుదారి పట్టించేందుకే తనపై చెప్పుల ఇష్యూను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు బండి.

మొత్తానికి బండి సంజయ్‌ చెప్పుల ఇష్యూ..రాజకీయంగా దుమారం రేపుతోంది. మునుగోడులో ఆత్మగౌరవ సభ పెట్టి, ఢిల్లీ నేతల దగ్గర అది తాకట్టు పెట్టినట్లైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం