Komatireddy Venkat Reddy: రేవంత్‌రెడ్డితో వేదిక పంచుకోలేను.. సోనియాగాంధీకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ..

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy: రేవంత్‌రెడ్డితో వేదిక పంచుకోలేను.. సోనియాగాంధీకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ..
Komatireddy Venkat Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 22, 2022 | 8:41 PM

ఏఐసీసీ నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరు కాకపోవడం పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి(Sonia Gandhi) లేఖ రాశారు పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy). సోమవారం మధ్యాహ్నమే లేఖను 10, జనపథ్ లో లేఖను అందజేసి వెళ్లిపోయారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి. రేవంత్ రెడ్డి, మాణిక్యం టాగోర్ తీరుపై సోనియాకు ఫిర్యాదు చేశారు. తనను తిడుతూ, అవమానపరుస్తూ.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం అలవాటుగా మారిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరి కారణంగా పార్టీకి నష్టం జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కమల్ నాథ్ వంటి సీనియర్ నేతలకు రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు అప్పగించాలని అధినేత్రికి ఆయన తన లేఖలో సూచించారు. పార్టీలో తనలాగా అవమానాలకు గురవుతున్న మరికొందరి నేతల గురించి లేఖలో ప్రస్తావించారు వెంకటరెడ్డి. 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని కాదని, డబ్బులతో మేనేజ్ చేసుకుంటున్నవారికి బాధ్యతలు అప్పగించడం సరికాదని లేఖలో పేర్కొన్నారు వెంకటరెడ్డి.

తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడించడంతో పాటు.. ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారంటూ వివరణ ఇచ్చారు. చండూరు లో మీటింగ్, చెరుకు సుధాకర్ జాయినింగ్స్ అంశాల ప్రస్తావించారు. తన కుటుంబం పై చేసిన కామెంట్స్ ను ఈ లేఖలో పేర్కొన్నారు వెంకట్ రెడ్డి. రేవంత్ రెడ్డి తో వేదిక పంచుకోలేనంటూ  వివరణ ఇచ్చారు.

ఇదిలావుంటే.. ఏఐసీసీ నిర్వహించిన సమావేశానికి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరయ్యారు. ఉదయం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీలో కోమటిరెడ్డి వెంకరెడ్డి సమావేశమయ్యారు. అయితే సాయంత్రం జరిగిన పార్టీ సమావేశానికి మాత్రం ఆయన హాజరు కాలేదు. ఆయన కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేసిన సమావేవానికి దూరంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం