Telangana: ఒకవైపు సిట్‌.. మరోవైపు బీజేపీ మహా ధర్నా.. TSPSC వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామాలు

TSPSC పేపర్ లీకేజ్ కేసు ఇవాళ మరో కీలక టర్న్‌ తిరగబోతోంది. ఇవాళ ఒక్కరోజే అనేక పరిణామాలు జరగబోతున్నాయ్‌. ఒకవైపు సిట్‌ దూకుడు, మరోవైపు పొలిటికల్‌ ప్రకంపనలు కేసును మలుపు తిప్పబోతున్నాయ్‌. ఇంతకీ, ఇవాళ ఏం జరగబోతోంది?

Telangana: ఒకవైపు సిట్‌.. మరోవైపు బీజేపీ మహా ధర్నా.. TSPSC వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామాలు
TSPSC Paper Leak
Follow us

|

Updated on: Mar 25, 2023 | 6:44 AM

TSPSC పేపర్ లీకేజ్ కేసు ఇవాళ మరో కీలక టర్న్‌ తిరగబోతోంది. ఇవాళ ఒక్కరోజే అనేక పరిణామాలు జరగబోతున్నాయ్‌. ఒకవైపు సిట్‌ దూకుడు, మరోవైపు పొలిటికల్‌ ప్రకంపనలు కేసును మలుపు తిప్పబోతున్నాయ్‌. ఇంతకీ, ఇవాళ ఏం జరగబోతోంది? సిట్‌ లేటెస్ట్‌ స్టెప్స్‌ ఏంటి?. ఇవాళ్టి పొలిటికల్‌ సునామీ ఏంటి? అనేది ఓ సారి చూడండి..

TSPSC పేపర్‌ లీకేజీ వ్యవహారంలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. ఓవైపు నిందితులు, అనుమానితులను విచారిస్తూనే మొత్తం గుట్టు విప్పేందుకు ప్రయత్నిస్తోంది సిట్‌. అందులో భాగంగానే ఏడుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ మరోసారి కోర్టును ఆశ్రయించింది. A1-ప్రవీణ్‌, A2-రాజశేఖర్‌, A4-డాక్యా నాయక్‌, A5-కేతావత్‌ రాజేశ్వర్‌, A10-షమీమ్‌, A11-సురేష్‌, A12-రమేష్‌ను ఆరు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌ ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ రానుంది. ఇక, ఇవాళ బీజేపీ తలపెట్టిన మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పొలిటికల్‌ కాక మొదలవ్వనుంది.

ఇవి కూడా చదవండి

ఇవాళ్టి అప్‌డేట్స్‌ ఇలాగుంటే, BRS లీడర్‌ లక్ష్మారెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. అసలీ లీకేజీ వెనకున్నదే ఓ బీజేపీ ముఖ్యనేత అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కావాలనే ఆ పార్టీ నేతలు బురద జల్లుతున్నారంటూ మండిపడ్డారు.

ఇక, రేవంత్‌ చేస్తోన్న ఆరోపణలపై ఒక రేంజ్‌లో ఫైరయ్యారు మంత్రి ఎర్రబెల్లి. KTRపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. రాహుల్‌గాంధీ లేటెస్ట్‌ ఎపిసోడే అందుకు రుజువన్నారు ఎర్రబెల్లి.

TSPSC వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామాలైతే జరగబోతున్నాయ్‌. TSPSC ఉద్యోగి శంకరలక్ష్మిని ప్రధాన సాక్షిగా పేర్కొన్న సిట్‌, ఏడుగురు నిందితులను మళ్లీ కస్టడీకి ఇవ్వాలని కోరింది. మరోవైపు పేపర్‌ లీకేజీపై ఇవాళ పెద్దఎత్తున ఆందోళనలు చేయబోతోంది బీజేపీ. మరి, ఈ లీకేజీల సునామీ ఏ తీరంచేరి ఆగుతుందో?, ఎక్కడ తేలుతుందో చూడాలి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..