Telangana: రూ.50 వేల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సంగారెడ్డి డీఈవో..
రూ. 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు సంగారెడ్డి డీఈవో రాజేష్. ఓ ప్రయివేట్ స్కూల్ ఎస్‌ఎస్‌సీ సిలబస్ నుంచి ICSEకి అప్ గ్రేడ్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఇందుకోసం సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణతో స్కూల్ యాజమాన్యం చర్చలు జరిపింది.

ఆయన విద్యా శాఖకు సంబంధించి జిల్లాకే బాస్. ఆయనే ఏకంగా అవినీతికి తెరతీశాడు. డబ్బులు తీసుకుంటూ అడ్డంగా ఏసీబీకి చిక్కాడు. రూ. 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు సంగారెడ్డి DEO రాజేష్. ఓ ప్రయివేట్ స్కూల్ SSC సిలబస్ నుంచి ICSEకి అప్ గ్రేడ్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఇందుకోసం సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణతో స్కూల్ యాజమాన్యం చర్చలు జరిపింది. అయితే స్కూల్ NOC కోసం లక్షా 10 వేల రూపాయలు డిమాండ్ చేశారు. ముందు 50 వేల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి, తర్వాత 60 వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు.
డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక స్కూల్ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది. ఈ నెల 15న ఏసీబీకి అందిన ఫిర్యాదు మేరకు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, డీఈవో రాజేశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిబంధనల ప్రకారం డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చినా అధికారులు డబ్బులు కోసం స్కూల్ యాజమాన్యాన్ని వేధించడంతో ఏసీబీని ఆశ్రయించారు. కేసులో డీఈఓ రాజేశ్, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణను నిందితులుగా చేర్చారు.
డీఈఓ దగ్గరకు ఇలాంటి అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి? వచ్చిన వాటిలో డబ్బులివ్వకుంటే ఏమైన పెండింగ్‌లో పెట్టారా అని ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
