Kishan Reddy: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అవినీతి పార్టీలు.. వాటి డీఎన్‌ఏ ఒక్కటే.. బీసీ ఆత్మగౌరవ సభలో కిషన్‌ రెడ్డి

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని, అవినీతి చేయడంలో దొందూ దొందేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న బీజేపీ ఆత్మ గౌరవ సభలో కిషన్‌ రెడ్డి ప్రసంగించారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లిస్‌ ఒకే తాను ముక్కలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Kishan Reddy: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అవినీతి పార్టీలు.. వాటి డీఎన్‌ఏ ఒక్కటే.. బీసీ ఆత్మగౌరవ సభలో కిషన్‌ రెడ్డి
Kishan Reddy
Follow us
Basha Shek

|

Updated on: Nov 07, 2023 | 7:45 PM

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని, అవినీతి చేయడంలో దొందూ దొందేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న బీజేపీ ఆత్మ గౌరవ సభలో కిషన్‌ రెడ్డి ప్రసంగించారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లిస్‌ ఒకే తాను ముక్కలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మన్మోహన్‌ హయాంలో కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు కూడా మంత్రులుగా ఉన్నారని గుర్తు బీజేపీ చీఫ్‌ గుర్తుచేశారు.’ పదేళ్ల క్రితం ఇదే స్టేడియానికి గుజరాత్‌ సీఎంగా మోడీ వచ్చారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ దేశంలో మార్పునకు నాంది. ఆ సభ తర్వాతనే మోదీ ప్రధాని అయ్యారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ పార్టీ కాంగ్రెస్, మజ్లిస్‌ ఒకే తాను ముక్కలు. కాంగ్రెస్‌ పార్టీ అమ్ముడు పోయే పార్టీ. బీఆర్‌ఎస్‌ కొనుగోలు చేసే పార్టీ. ఈ రెండూ అవినీతి పార్టీలే. వీటి డీఎన్‌ఏ కూడా ఒక్కటే. బీఆర్​ఎస్​కు అమ్ముడుపోబోమని కాంగ్రెస్‌ నేతలు చెప్పగలరా? ద్రౌపదిముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా వస్తే కేసీఆర్‌ పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ రాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్​ఎస్​ ఘన స్వాగతం పలికిం ది. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాష్ట్రంలో మార్పురాదు’ అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

అవినీతి పరులను వదిలిపెట్టం..

కాగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ మంగళవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం వేదికగా బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో సభ నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోడీ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌తో పాటు బీజేపీ నాయకులు, శ్రేణులు భారీగా హాజరయ్యారు. కాగా బీసీ ఆత్మ గౌరవ సభలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు ‘ ఈ నేలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. మోదీని ప్రధానిని చేసే ఘట్టానికి పునాది పడింది ఇక్కడే. తెలంగాణలో మార్పు తుఫాన్‌ కనిపిస్తోంది. ఇక్కడి నుంచే తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారు. లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్‌ మాపై ఆరోపణలు చేస్తోంది. అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదు. అవినీతి చేస్తే కచ్చితంగా జైలులో వేస్తాం’ అని మోదీ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

బీ ఆర్ ఎస్ ఆత్మ గౌరవ సభలో ప్రధాని మోడీ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..