AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Crime: ప్రేమను నిరాకరించిందనీ.. మహిళపై కత్తితో దాడి చేసిన ఆటో డ్రైవర్!

తలరాత చెదిరి ఓ మహిళ భర్తతో విడిపోయింది. దీంతో పిలలతో సహా పుట్టింటికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఐతే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆమెపై కన్నేశాడు. తనన ప్రేమించాలంటూ సదరు మహిళను నిత్యం వేధించసాగాడు. మహిళ అతని ప్రేమను నిరకారించడంతో దారుణానికి పాల్పడ్డాడు. అదును చూసి ఆమె ఇంట్లో దూరి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని..

Telangana Crime: ప్రేమను నిరాకరించిందనీ.. మహిళపై కత్తితో దాడి చేసిన ఆటో డ్రైవర్!
Man Attacked On Married Woman With Knife
N Narayana Rao
| Edited By: Srilakshmi C|

Updated on: Oct 05, 2023 | 2:55 PM

Share

కొత్తగూడెం, అక్టోబర్‌ 5: తలరాత చెదిరి ఓ మహిళ భర్తతో విడిపోయింది. దీంతో పిలలతో సహా పుట్టింటికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఐతే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆమెపై కన్నేశాడు. తనన ప్రేమించాలంటూ సదరు మహిళను నిత్యం వేధించసాగాడు. మహిళ అతని ప్రేమను నిరకారించడంతో దారుణానికి పాల్పడ్డాడు. అదును చూసి ఆమె ఇంట్లో దూరి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసానికి గ్రామానికి చెందిన అనే వివాహిత భర్తతో విడిపోయి పుట్టింటి వద్ద ఉంటోంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోన్న నజియా స్థానిక పాఠశాలలో పిల్లలను చదివించుకుంటుంది. తన కుటుంబ పోషణకు పాల్వంచ పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తుంది. అదే గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తనను ప్రేమించాలని నిత్యం నజియాను వేధించసాగాడు. ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దీంతో ధ్వేషం పెంచుకున్న శివ అదునుకోసం ఎదురుచూడసాగాడు.

ఈ క్రమంలో రోజు లాగానే పిల్లలను స్కూలుకు పంపించి తాను షాపుకు వెళ్లేందుకు నిమగ్నమై ఉండగా ఆటో డ్రైవర్ శివ ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తన ప్రేమను అంగీకరించాలని.. ఆమెతో గొడవ పడ్డాడు. ఆమె ఒప్పుకోక పోవడంతో తనతో తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. మహిళ కేకలు వేయడంతో తల్లి వచ్చి శివను అడ్డుకుంది. ఈ పెనుగులాటలో శివ పరారయ్యాడు. కత్తితో దాడి చేయగా నజియా చేతికి గాయాలయ్యాయి. బాధితురాలుపోలీసు స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసింది. ఆమెను చికిత్స కోసం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పాల్వంచ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఆటో డ్రైవర్ శివ పరారీలో ఉన్నాడు.. బాధిత మహిళను గత కొద్దిరోజులుగా ప్రేమించాలని, వేధిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలు కేకలు వేయగా తల్లి వచ్చి అడ్డుకోక పోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని, నిందితుడు నీ కఠినంగా శిక్షించాలని బాధితురాలు పోలీసులను కోరుతోంది

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..