KTR US Tour: తెలంగాణకు క్యూ కడుతున్న అంతర్జాతీయ కంపెనీలు.. పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న కేటీఆర్ అమెరికా పర్యటన

అమెరికా తర్వాత క్వాల్కమ్ కంపెనీకి రెండో అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో అక్టోబర్ లో ప్రారంభం కానుంది.

KTR US Tour: తెలంగాణకు క్యూ కడుతున్న అంతర్జాతీయ కంపెనీలు.. పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న కేటీఆర్ అమెరికా పర్యటన
Ktr In Us
Follow us

|

Updated on: Mar 23, 2022 | 6:46 AM

KTR America Tour: తెలంగాణ(Telangana) రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖమంత్రి మంత్రి కేటీ రామారావు(Minister KTR) అమెరికా పర్యటనలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పర్యటనలో పలు అంతర్జాతీయ కంపెనీలతో సమావేశమవుతున్న మంత్రి.. తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని కోరుతున్నారు. ఇక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులను వివరిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. దీనిపై చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.

తెలంగాణలో తమ పరిశోధన అభివృద్ధి, డిజి టెక్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్న ఫిస్కర్, కాల్ వే సంస్థలు ప్రకటించాయి. అమెరికాలో రెండు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేయబోయే మొబిలిటీ క్లస్టర్ లో భాగస్వాములయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది ఫిస్కర్ కంపెనీ. మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశాల తర్వాత రెండు కంపెనీలు ఈ విషయాన్ని ప్రకటించాయి.

అమెరికా తర్వాత క్వాల్కమ్ కంపెనీకి రెండో అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో అక్టోబర్ లో ప్రారంభం కానుంది. 3 వేల 904 కోట్ల 55 లక్షల రూపాయల పెట్టుబడితో ఈ కేంద్రం త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ క్యాంపస్ ఏర్పాటు తర్వాత 8700 మంది టెక్ నిపుణులకు ఉద్యోగాలు రానున్నాయి. అగ్రిటెక్, విద్యారంగం, కనెక్టెడ్ డివైస్ ల వినియోగం, స్మార్ట్ సిటీ కార్యక్రమాల్లో భాగం కావడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు క్వాల్కమ్ కంపెనీ యాజమాన్యం తెలిపింది.

అటు ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరొక ప్రముఖ కంపెనీ అయిన ఫిస్కర్.. హైదరాబాద్ లో ఐటి, డిజిటల్ డెవలప్‌మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఇందుకోసం సంప్రదింపులు జరుపుతున్న కంపెనీ తాజాగా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. లాస్ ఏంజెల్స్ లోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈఓ హెన్రీక్ ఫిష్కర్, సియఫ్ వో గీతా ఫిస్కర్ లతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.

మరోవైపు గోల్ఫ్ క్రీడకు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీ క్యాలవే హైదరాబాద్ లో తన డిజిటల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

Read Also….  SIDBI recruitment 2022: 70వేల వేతనంతో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. రేపటితో ముగియనున్న గడువు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..