AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్. వారిని ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపారు స్పీకర్. సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్‌, హరీష్‌రావు, తలసాని, జగదీష్‌రెడ్డి, సబిత, సునీత, కోవాలక్ష్మి సహా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Telangana: అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్!
Brs Mlas Suspended From The Assembly
Anand T
|

Updated on: Sep 09, 2026 | 11:28 AM

Share

మూడవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. నిన్న ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ పరిణామాలపై ఇవాళ అసెంబ్లీలో రచ్చ ప్రారంభంగా కాగా.. శుద్ధి అంశంపై చర్చ పెట్టాలని ప్రభుత్వం కోరింది. కానీ అటు బీఆర్ఎస్ మాత్రం కేసీఆర్‌పై షాద్‌నగర్ ఎమ్మెల్యే వ్యాఖ్యల మీద చర్చకు పట్టు బట్టింది. అందుకు స్పీకర్ నిరాకరించడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది, వెల్‌లోకి వచ్చి నిరసన తెలపడం, సభను అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్‌ను ప్రతిపాదించిన మంత్రి శ్రీధర్‌ బాబు.. దీంతో ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్. సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, గంగుల సహా 20 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇదిలా ఉండగా అటు శాసన మండలిలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. మొన్న అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణాల నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్సీల వ్యవహారం ఎథిక్స్ కమిటీకి వెళ్లింది. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు శాసనమండలి చైర్మన్. దీంతో ఎథిక్స్ కమిటీ ఏం నిర్ణయం తీసుకోబోతుందనే దాని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us